ఆదివారం.. ఆదిత్యుని ఆరాధనతో మీ రోజును ప్రారంభించండి.గ్రహ నక్షత్రాల గమనం ప్రతిరోజూ మారుతుంటుంది. దీని ప్రభావం నేరుగా మన జీవితాలపై, తీసుకునే నిర్ణయాలపై ఉంటుంది. నేడు ఏప్రిల్ 19, ఆదివారం. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా నేడు అక్షయ తృతీయ పర్వదినం కూడా కావడంతో, ఈ రోజు చేసే పనులు మీ జీవితంలో అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. మరి ఈ విశిష్టమైన రోజున ఏ రాశి వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు రాశి ఫలాలు

మేష రాశి: ఈ రోజు మీకు బాధ్యతలు పెరగనున్నాయి. ఆఫీసులో లేదా వ్యాపారంలో కొత్త పని మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు పనికిరాదు. కుటుంబంతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృషభ రాశి: ఓర్పు మీకు శ్రీరామరక్ష. కొన్ని పనులు మీరు ఊహించిన దానికంటే ఆలస్యం కావచ్చు. అనవసర ఆలోచనలు పక్కన పెడితే సాయంత్రానికి అంతా శుభమే జరుగుతుంది.
మిథున రాశి: ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు మిత్రుల సహకారంతో ముందుకు సాగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున బడ్జెట్‌ను సరిచూసుకోండి.
కర్కాటక రాశి: నేడు ఈ రాశి వారు భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు నిలకడగా ఉంటాయి.
సింహ రాశి: మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ కష్టానికి ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. అయితే, కోపంపై నియంత్రణ అవసరం. సాయంత్రం విశ్రాంతికి కేటాయించండి.
కన్య రాశి: కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, తెలివితేటలతో మేనేజ్ చేస్తారు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి.
తులా రాశి: తులా రాశి వారికి ఈరోజు సాధారణంగా గడిచిపోతుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా నూనె పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
{{/usCountry}}తులా రాశి: తులా రాశి వారికి ఈరోజు సాధారణంగా గడిచిపోతుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా నూనె పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
{{/usCountry}}వృశ్చిక రాశి: మీ మనసు చెప్పిన మాట వినండి. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం మీకు అందుతుంది. వ్యాయామం మీ దినచర్యలో భాగంగా చేసుకుంటే మరింత చురుగ్గా ఉంటారు.
ధనుస్సు రాశి: మీరు చేపట్టిన ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. భాగస్వామి మద్దతు మీకు కొండంత అండగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారుతాయి.
మకర రాశి: ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా నిలబడండి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. సాయంత్రం వేళ దగ్గరలోని పర్యాటక ప్రాంతానికి వెళ్లడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
కుంభ రాశి: కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి.
మీన రాశి: సృజనాత్మకత పెంచుకోవడానికి నేడు అనుకూలమైన రోజు. మిత్రులతో సంభాషణలు ఆనందాన్ని ఇస్తాయి. బయటి ఆహారానికి దూరంగా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.