జనవరి 3న వచ్చే పుష్య పౌర్ణమి చాలా విశేషమైనది. పుష్య పౌర్ణమి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది. పుష్య పౌర్ణమి నాడు చేసే స్నాన, దానాలకు కూడా ఎంతో గొప్ప పుణ్యఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. పుష్య పౌర్ణమి నాడు కొన్ని దానాలు చేయడం, పూజలు చేయడం, పద్ధతులను పాటించడం వలన నవగ్రహాలను కూడా శాంతింప చేయవచ్చు. నవగ్రహాల కారణంగా ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు.
పుష్య పౌర్ణమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏం చేయాలి?

పౌర్ణమి జనవరి 3, అనగా రేపు వచ్చింది. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటించడం వలన గ్రహాల కారణంగా ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడే తెలుసుకుందాం.
గ్రహాలను ఎలా శాంతింప చేయవచ్చు? దోషాలను తగ్గించడానికి ఏ పద్ధతులను పాటించాలి?
1.సూర్యుని కారణంగా దోషాలు తగ్గాలంటే
సూర్య కారణంగా దోషాలు తగ్గాలంటే కొన్ని పరిహారాలను పాటించండి. పుష్య పౌర్ణమి నాడు సూర్యుడిని శాంతింప చేయడానికి గోధుమలను దానం చేయండి. రాగి వస్తువులు, బెల్లం దానం చేస్తే కూడా మంచిదే. అవసరమైన వారికి ఆహారాన్ని పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో సూర్యుడు స్థానం బలపడుతుంది. దాంతో కెరీర్‌లో కూడా ఉత్తమ ఫలితాలను చూడొచ్చు.
2.చంద్రుడిని శాంతింప చేయడానికి ఏం చేయాలి?
చంద్ర దోషాల నుంచి బయట పడడానికి, చంద్రుని కారణంగా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి తెల్లని వస్తువులను దానం చేయండి. పాలు, బియ్యం, తెల్లని వస్త్రాలు, వెండి వంటి వాటిని దానం చేయవచ్చు. అలాగే ఆ రోజు శివుడిని ఆరాధిస్తే జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది. దీంతో శుభ ఫలితాలను పొందవచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు.
3.శని బాధల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
పుష్య పౌర్ణమి నాడు శని బాధల నుంచి బయటపడడానికి నల్ల నువ్వులను దానం చేయండి. ఇనుము వస్తువులను దానం చేస్తే కూడా మంచిదే. అలాగే శివుణ్ని, హనుమంతుణ్ని పూజించండి.
4.శుక్ర దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
{{/usCountry}}పుష్య పౌర్ణమి నాడు శని బాధల నుంచి బయటపడడానికి నల్ల నువ్వులను దానం చేయండి. ఇనుము వస్తువులను దానం చేస్తే కూడా మంచిదే. అలాగే శివుణ్ని, హనుమంతుణ్ని పూజించండి.
4.శుక్ర దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
{{/usCountry}}పుష్య పౌర్ణమి నాడు శుక్ర దోషం నుంచి బయటపడడానికి పెరుగు, బియ్యం, పంచదార, తెల్లని వస్త్రాలను దానం చేయండి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతాయి.
5.బుధుని అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి?
బుధ బాధల నుంచి బయటపడడానికి, బుధుని అనుగ్రహం పొందడానికి ఈ పుష్య పౌర్ణమి నాడు ఆకుపచ్చని కూరగాయలను దానం చేయండి. ఆకుపచ్చని పప్పులను కూడా దానం చేయవచ్చు. అలాగే ఏమీ లేని వారికి, పేదవారికి తోచినది దానం చేయండి. దీంతో చక్కటి ఫలితాలను చూస్తారు. విద్య, వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది.
6.కుజ బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలి?
పుష్య పౌర్ణమి నాడు కుజ బాధలు తొలగిపోవాలంటే బెల్లం, ఆకుపచ్చని పప్పులు, ఎర్రటి వస్త్రాలను దానం చేయండి. హనుమాన్ చాలీసాను చదవండి.
7.గురువు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి?
పుష్య పౌర్ణమి నాడు గురుగ్రహం వలన ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కుంకుమపువ్వు, పసుపు, చందనాన్ని దానం చేయండి. అలాగే అదృష్టం వచ్చి సక్సెస్‌ను కూడా అందుకుంటారు.
8.రాహు–కేతువుల దోషాల నుంచి ఎలా బయటపడవచ్చు?
రాహు, కేతు దోషాల నుంచి బయటపడడానికి పుష్య పౌర్ణమి నాడు మినప్పప్పు, ఆవాల నూనె, నల్ల నువ్వులను దానం చేయండి. పేదవారికి సహాయం చేయండి. దీంతో ఈ రెండు నీడ గ్రహాల ప్రభావం నుంచి బయటపడవచ్చు. కాలభైరవుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.