...
...
Next Story

Shani Jayanthi Puja: రేపు చాలా విశేషమైన శనివారం+శని జయంతి+శని అమావాస్య.. పూజా విధానం, దానాలతో పాటు శ్లోకాలు ఇవిగో!

Shani Jayanthi Puja: 2026 మే 16న శని జయంతి పర్వదినం వచ్చింది. శనివారం నాడే ఈ జయంతి రావడం అత్యంత విశేషం. ఈ పవిత్ర రోజున శని దేవుడిని ఎలా పూజించాలి? ముహూర్తం, దానధర్మాలు మరియు మంత్రాల పూర్తి వివరాలు మీకోసం.

Published on: May 15, 2026, 15:57:37 IST
Advertisement

ప్రతీ ఏటా వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య నాడు శని జయంతిని జరుపుకుంటాము. హిందూ మత విశ్వాసం ప్రకారం సూర్యనారాయణమూర్తి, ఛాయాదేవి కుమారుడైన శనీశ్వరుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించారు. శనీశ్వరుడి జన్మ దినోత్సవం నాడు శని దేవుడుని సరిగ్గా పూజిస్తే శని బాధల నుంచి బయటపడొచ్చని, ఆయన అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చని నమ్మకం.

Shani Jayanthi Puja: రేపు చాలా విశేషమైన శనివారం+శని జయంతి+శని అమావాస్య (pinterest)
Shani Jayanthi Puja: రేపు చాలా విశేషమైన శనివారం+శని జయంతి+శని అమావాస్య (pinterest)

శని జయంతి నాడు శనీశ్వరుడిని ప్రత్యేకించి ఆరాధించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. శని అనుగ్రహం ఉంటే వ్యాధులు, అప్పుల నుంచి కూడా బయటపడొచ్చు. దానధర్మాలు చేస్తే ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. శని జయంతి నాడు ఎలా ఆరాధించాలి? శని జయంతి తేదీ, సమయంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శని జయంతి 2026 ఎప్పుడు?

వైశాఖ మాసంలో అమావాస్య తిథి మే 16, అనగా రేపు శనివారం ఉదయం 5:11 గంటలకు మొదలవుతుంది. మే 17, ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథి ప్రకారం శని జయంతిని జరుపుకోవాలి. అందుకే మే 16, అనగా రేపు శనివారం నాడు శని జయంతిని జరుపుకోవాలని చెబుతున్నారు. ఈసారి శని జయంతి శనివారం రావడం మరింత విశేషమైనది. ఇది చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఇలా శనిదేవుని ఆరాధించండి. ఎలా పూజించాలో క్లుప్తంగా తెలుసుకుందాం.

శని జయంతి పూజా విధానం

శనివారం శని జయంతి రావడం విశేషమైన రోజు కాబట్టి, శనీశ్వరుడిని ఆరాధించడానికి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి.

శని దేవుడి ముందు రెండు కుందులు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి.

శనికి పంచగవ్యం, పంచామృతం మొదలైన వాటితో అభిషేకం చేయించి, ఆ తర్వాత కుంకుమను పెట్టండి.

శని దేవుడికి పువ్వులను సమర్పించి, నూనెతో చేసిన స్వీట్లు ప్రసాదంగా పెట్టండి.

జపమాల తీసుకుని శని మంత్రాన్ని 108 సార్లు జపించండి.

“ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈ శని జయంతి నాడు శని చాలీసా పారాయణం చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. పూజ సమయంలో చేసిన తప్పులకు క్షమాపణ అడిగి, శనీశ్వరుని ఆశీర్వాదాలు పొందండి.

శనివారం శని జయంతి నాడు చేయాల్సిన దానాలు

  • ఈరోజు నల్ల నువ్వులు, నూనె, నల్లని వస్త్రాలు, చెప్పులు వంటివి దానం చేస్తే మంచిది.
  • అలాగే నల్ల వస్త్రాలు, మినప్పప్పు, దుప్పట్లు కూడా దానం చేయొచ్చు.
  • పేదవారికి అన్నదానం చేస్తే కూడా శని జయంతి వేళ శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది.

ఈ శని మంత్రాలు కూడా చదువుకోండి

ఓం శం శనైశ్చరాయ నమః

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్

ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి.. తన్నో మందః ప్రచోదయాత్

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

(ఈ మంత్రం చదివితే శని దోషాల నుంచి బయట పడచ్చు)

ఓం హ్రీం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్.. శుభం కురు శనైశ్చరాయ నమః

(ఈ మంత్రం చదివితే వృత్తి, వ్యాపారాల్లో విజయాలను పొందవచ్చు)

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe