ప్రతినెలా శుక్లపక్ష అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటాము. అయితే ఈ నెలలో వచ్చే దుర్గాష్టమి మంగళవారం నాడు రావడం విశేషం. ఈ దుర్గాష్టమి వేళ అమ్మవారిని ఇలా ఆరాధించడం వలన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. మరి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే రేపు దుర్గాష్టమి వేళ ఏం చేయాలి? ఎలా అమ్మవారిని పూజిస్తే శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
దుర్గాష్టమి పరిహారాలు

దుర్గాష్టమి నాడు ఈ పరిహారాలను పాటించడం వలన అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై పడుతుంది. రాహుకాల దీపాలు వెలిగిస్తే ఆనందంగా ఉండొచ్చు, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. రాహుకాల దీపాలను ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగిస్తే మంచిదో కూడా చూసేద్దాం.
చాలా శక్తివంతమైన దుర్గాష్టమి
ఫిబ్రవరి 24, అనగా రేపు వచ్చే దుర్గాష్టమి చాలా శక్తివంతమైనది. పైగా మంగళవారం రావడం మరింత విశేషం. ఉదయం ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి, తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి. గడపలకు పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టి దుర్గాదేవిని పూజించాలి. అలా చేస్తే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.
దుర్గాష్టమి పూజా విధానం
అమ్మవారి చిత్రపటానికి పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టి ఎర్రటి మందారం పూలను సమర్పించండి. దొరికితే ఎర్రటి గులాబీలను కూడా సమర్పించవచ్చు.
లక్ష్మీదేవిని లేదా గౌరీదేవిని అయినా ఆరాధించొచ్చు. నిమ్మకాయలకు బొట్లు పెట్టి పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేయండి.
యథావిధిగా పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన పులిహోర లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టండి.
అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి మట్టి గాజులను పూజ గదిలో పెట్టి, పూజ పూర్తయ్యాక వాటిని ధరించడం మంచిది.
{{/usCountry}}అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి మట్టి గాజులను పూజ గదిలో పెట్టి, పూజ పూర్తయ్యాక వాటిని ధరించడం మంచిది.
{{/usCountry}}“ఓం దుం దుర్గాయ నమః” మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించడం వలన దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు.
అయితే రాహుకాలం సమయంలో అమ్మవారు భూమిపై సంచరిస్తారని నమ్మకం. కాబట్టి ఆ సమయంలో రాహుకాల దీపాలను వెలిగించడం మంచిది.
రాహుకాలం దీపాలు
రాహుకాలం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర మధ్యలో ఉంటుంది. దుర్గాదేవి ఆలయం లేదా తులసి కోట ముందు రాహుకాల దీపాలను వెలిగిస్తే అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. రాహుకాల దీపాలను నిమ్మకాయలతో వెలిగించాలి. 9 నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ముందు ఒక విస్తరాకుపై బియ్యం పిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమలు కూడా వేసి పసుపు గణపతిని, గౌరీదేవిని చేసి విస్తరాకుపై పెట్టి తొమ్మిది నిమ్మకాయ దీపాలను వెలిగించాలి.
నిమ్మకాయను కట్ చేసి గుజ్జు తీసేసి వాటిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి తొమ్మిది దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత అరటిపండ్లను నైవేద్యంగా పెట్టండి. కుదిరితే పసుపు, కుంకుమలు, మట్టి గాజులు, జాకెట్ ముక్కను తాంబూలంగా ముత్తైదువుకు ఇవ్వండి. ఇలా దుర్గాష్టమి నాడు రాహుకాల దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.