చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మన సమస్యలకు కారణం గ్రహాల కదలికలు కూడా అవ్వచ్చు. అయితే చాలామంది శని బాధలతో సతమతమవుతుంటారు. శని కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

రేపు, అనగా జూన్ 13న మాస శివరాత్రి, శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం అని చెప్పొచ్చు. శని బాధల నుంచి బయటపడడానికి ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. రేపు మాస శివరాత్రి, శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం కనుక ఈ మహోత్తరమైన రోజున శివాభిషేకం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్షు పెరుగుతుంది, సంపద కూడా కలుగుతుంది.
ఏలినాటి శనితో సతమతమవుతున్న రాశులు:
కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు రాశుల్లో మీ రాశి కూడా ఉన్నట్లయితే ఈ రోజున దశరథ ప్రోక్త, శని స్తోత్రం చదువుకోవడం మంచిది.
అర్ధాష్టమ శని, అష్టమ శని:
ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. సింహ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. అలాగే సింహరాశిలో సర్పగ్రహమైనటువంటి కేతువు, కుంభరాశిలో సర్పగ్రహమైన రాహువు ఉన్నారు. కాబట్టి రాహు, కేతు దోషాల నుంచి బయటపడడానికి శివాభిషేకం చేస్తే మంచిది.
ఇంట్లో శివాభిషేకం చేసుకోవచ్చా?
ఈ రాశుల వారు సమస్యల నుంచి బయటపడడానికి ఇంట్లో కూడా శివలింగం ఉన్నట్లయితే శివాభిషేకం చేసుకోవచ్చు. అలాగే సమస్యలు ఏమీ లేని వారు మహాశివుని అనుగ్రహం కోసం మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేసుకోవచ్చు. శివుడికి ఇష్టమైన మారేడు దళాలను సమర్పిస్తే మరీ మంచిది.
ఐశ్వర్యం కలగడానికి, గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఏం చేయాలి?
ఈ పవిత్రమైన దినాన ఐశ్వర్యం కలగాలంటే బిల్వాష్టకం చదువుకుంటే మంచిది. అలాగే గ్రహ దోషాల నుంచి బయట పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదువుకోండి. దీని వలన గ్రహదోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. బాధలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.
అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకుంటే వివాహం అవుతుంది:
{{/usCountry}}ఈ పవిత్రమైన దినాన ఐశ్వర్యం కలగాలంటే బిల్వాష్టకం చదువుకుంటే మంచిది. అలాగే గ్రహ దోషాల నుంచి బయట పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదువుకోండి. దీని వలన గ్రహదోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. బాధలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.
అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకుంటే వివాహం అవుతుంది:
{{/usCountry}}వివాహం కాని వారు ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది.
సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం:
సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయడం వలన కుజదోషం తొలగిపోతుంది. రేపు కృత్తికా నక్షత్రం ఉంది కనుక కుజదోషం పోవడానికి ఈ పరిహారాన్ని పాటించండి. అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ మంత్రాలను చదువుకుంటే కూడా మంచిది:
ఒకవేళ ఈ పరిహారాలను పాటించలేము అనుకునేవారు ఈ శ్లోకాలు, ఈ మంత్రాలను జపించడం మంచిది.
"శం శనైశ్చరాయ నమః"
"శివాయ గురవే నమః"
ఈ మంత్రాలను 108 సార్లు జపిస్తే అద్భుతంగా పని చేస్తుంది.
శివయ్య అనుగ్రహం కలగడానికి ఈ మంత్రం జపించండి:
ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో సమస్యలు తొలగిపోవాలంటే "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.