ప్రతి నెలలో కూడా రెండు చతుర్థి తిథులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వస్తే, ఇంకొకటి కృష్ణపక్షంలో వస్తుంది. కానీ రేపు వచ్చే సంకష్ట చతుర్థి మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ప్రతి నెలలో వచ్చే చతుర్థి కాదు. మూడేళ్లకు ఒకసారి వచ్చే విభువన సంకష్ట చతుర్థి. ఇది అధిక మాసంలో మాత్రమే వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం కనుక ఈ చతుర్థి తిథిని విభువన సంకష్ట చతుర్థి అని అంటారు.

ఈ రోజు చాలా శక్తివంతమైనది. కాబట్టి సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షలను ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఈ విభువన సంకష్ట చతుర్థి నాడు పూజించడం వలన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి విజయవంతంగా అభివృద్ధి అవుతారు.
విభువన సంకష్ట చతుర్థి 2026 తేదీ, సమయం
పంచాంగం ప్రకారం, జూన్ 3, బుధవారం ఈ విభువన సంకష్ట చతుర్థి వచ్చింది. అలాగే ఉపవాసం ఉండడం వలన కూడా వినాయకుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయి.రేపు చతుర్థి నాడు రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే కూడా శుభ ఫలితాలను పొందవచ్చు.
చంద్రోదయం ఎప్పుడు అవుతుంది?
విభువన సంకష్ట చతుర్థి నాడు చంద్రోదయం రాత్రి 9:26 గంటలకు మొదలై 10 గంటలకు ముగుస్తుంది. చంద్రుడికి పచ్చిపాలు, నీళ్లను సమర్పించడం వలన చంద్రుని పూర్తి అనుగ్రహం కలుగుతుంది.
పూజ చేసేటప్పుడు వీటిని పాటించండి
స్నానం చేసి ఉపవాస దీక్షను తీసుకుని, వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకుడికి సింధూరం, గరిక, ఎర్రటి పూలు, మోదకాలు, లడ్డూలు వంటివి సమర్పించండి. గణేష్ మంత్రాలు, గణేష్ చాలీసాను కూడా చదువుకోండి.
వ్యాపారంలో పురోగతి కోసం ఇలా చేయండి
వ్యాపారస్తులు పురోగతి కోసం వినాయకుడిని పూజించి, ఐదు ముద్దల పసుపును వినాయకుని ఆరాధించేటప్పుడు సమర్పించండి. ఇలా చేయడం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే మంచిది.
ఆర్థిక ఇబ్బందులు ఉంటే
{{/usCountry}}వ్యాపారస్తులు పురోగతి కోసం వినాయకుడిని పూజించి, ఐదు ముద్దల పసుపును వినాయకుని ఆరాధించేటప్పుడు సమర్పించండి. ఇలా చేయడం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే మంచిది.
ఆర్థిక ఇబ్బందులు ఉంటే
{{/usCountry}}ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే, ఈ విభువన సంకష్ట చతుర్థి నాడు వినాయకుడిని పూజించి బెల్లం, నెయ్యి లాంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత వాటిని తీసుకువెళ్లి గోమాతకు తినిపించండి. ఇలా చేయడం వలన మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఏ మంత్రాన్ని జపించాలి?
ఈ రోజు "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పరిహారాన్ని పాటించడం వలన అడ్డంకులు తొలగిపోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.