జ్యేష్ఠ మాసంలో అరుదైన విభువన సంకష్టి.. రేపు ఈ 4 పరిహారాలు పాటిస్తే ధన సంపద, ఐశ్వర్యం లభిస్తాయి!

రేపు (జూన్ 3) అత్యంత పవిత్రమైన విభువన సంకష్ట చతుర్థి. అధిక మాసంలో వచ్చే ఈ విశిష్ట రోజున చంద్రోదయ సమయం, పూజా విధానం మరియు వ్యాపార, ఆర్థిక ఇబ్బందులు తొలగించే సులభమైన పరిహారాలు మీకోసం.

Published on: Jun 2, 2026, 11:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెలలో కూడా రెండు చతుర్థి తిథులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వస్తే, ఇంకొకటి కృష్ణపక్షంలో వస్తుంది. కానీ రేపు వచ్చే సంకష్ట చతుర్థి మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ప్రతి నెలలో వచ్చే చతుర్థి కాదు. మూడేళ్లకు ఒకసారి వచ్చే విభువన సంకష్ట చతుర్థి. ఇది అధిక మాసంలో మాత్రమే వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం కనుక ఈ చతుర్థి తిథిని విభువన సంకష్ట చతుర్థి అని అంటారు.

జ్యేష్ఠ మాసంలో అరుదైన విభువన సంకష్టి.. ఈ 4 పరిహారాలు పాటిస్తే ధన సంపద, ఐశ్వర్యం లభిస్తాయి! (pinterest)
జ్యేష్ఠ మాసంలో అరుదైన విభువన సంకష్టి.. ఈ 4 పరిహారాలు పాటిస్తే ధన సంపద, ఐశ్వర్యం లభిస్తాయి! (pinterest)

ఈ రోజు చాలా శక్తివంతమైనది. కాబట్టి సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షలను ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఈ విభువన సంకష్ట చతుర్థి నాడు పూజించడం వలన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి విజయవంతంగా అభివృద్ధి అవుతారు.

విభువన సంకష్ట చతుర్థి 2026 తేదీ, సమయం

పంచాంగం ప్రకారం, జూన్ 3, బుధవారం ఈ విభువన సంకష్ట చతుర్థి వచ్చింది. అలాగే ఉపవాసం ఉండడం వలన కూడా వినాయకుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయి.రేపు చతుర్థి నాడు రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే కూడా శుభ ఫలితాలను పొందవచ్చు.

చంద్రోదయం ఎప్పుడు అవుతుంది?

విభువన సంకష్ట చతుర్థి నాడు చంద్రోదయం రాత్రి 9:26 గంటలకు మొదలై 10 గంటలకు ముగుస్తుంది. చంద్రుడికి పచ్చిపాలు, నీళ్లను సమర్పించడం వలన చంద్రుని పూర్తి అనుగ్రహం కలుగుతుంది.

పూజ చేసేటప్పుడు వీటిని పాటించండి

స్నానం చేసి ఉపవాస దీక్షను తీసుకుని, వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకుడికి సింధూరం, గరిక, ఎర్రటి పూలు, మోదకాలు, లడ్డూలు వంటివి సమర్పించండి. గణేష్ మంత్రాలు, గణేష్ చాలీసాను కూడా చదువుకోండి.

వ్యాపారంలో పురోగతి కోసం ఇలా చేయండి

వ్యాపారస్తులు పురోగతి కోసం వినాయకుడిని పూజించి, ఐదు ముద్దల పసుపును వినాయకుని ఆరాధించేటప్పుడు సమర్పించండి. ఇలా చేయడం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే మంచిది.

ఆర్థిక ఇబ్బందులు ఉంటే

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే, ఈ విభువన సంకష్ట చతుర్థి నాడు వినాయకుడిని పూజించి బెల్లం, నెయ్యి లాంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత వాటిని తీసుకువెళ్లి గోమాతకు తినిపించండి. ఇలా చేయడం వలన మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

ఏ మంత్రాన్ని జపించాలి?

ఈ రోజు "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పరిహారాన్ని పాటించడం వలన అడ్డంకులు తొలగిపోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More