...
...
Next Story

రేపు సుబ్రహ్మణ్య షష్ఠి+శ్రవణ నక్షత్రం.. ఇలా చేస్తే కుజ, కాలసర్ప దోషాలు, నరఘోష, శత్రు బాధలు ఇలా ఏదైనా తొలగిపోతుంది!

సుబ్రహ్మణ్య షష్ఠి 2025: సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్న వారు, పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం, పిల్లల చదువుల ఇబ్బందులు, ప్రశాంతత తగ్గడం, నరఘోష ఎక్కువగా ఉండడం, శత్రు బాధలు, అప్పుల బాధలు ఇలా ఏ సమస్య అయినా సరే సుబ్రహ్మణ్య షష్టి నాడు తొలగించుకోవచ్చు.

Published on: Nov 25, 2025, 15:10:13 IST
Advertisement

Subrahamanya Sashti 2025: ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకుంటాము. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ తొలగి సంతోషంగా, ఆనందంగా ఉండడానికి కొన్ని నియమాలను పాటించడం మంచిది. సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రవణ నక్షత్రం ఉండడం, బుధవారం రావడం కూడా మరింత విశేషం.

Subrahamanya Sashti 2025: రేపు సుబ్రహ్మణ్య షష్ఠి+శ్రవణ నక్షత్రం (pinterest)
Subrahamanya Sashti 2025: రేపు సుబ్రహ్మణ్య షష్ఠి+శ్రవణ నక్షత్రం (pinterest)

సుబ్రహ్మణ్య షష్టి నాడు కొన్నింటిని పాటించడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు ఇలా చేయడం వలన సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్న వారు, పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం, పిల్లల చదువుల ఇబ్బందులు, ప్రశాంతత తగ్గడం, నరఘోష ఎక్కువగా ఉండడం, శత్రు బాధలు, అప్పుల బాధలు ఇలా ఏ సమస్య అయినా సరే సుబ్రహ్మణ్య షష్టి నాడు తొలగించుకోవచ్చు.

రేపు సుబ్రహ్మణ్య షష్టి నాడు ఇలా చేస్తే మంచిది

రేపు సుబ్రహ్మణ్య షష్టి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లండి. ఆవు పాలతో అభిషేకం చేయండి. ఎర్రటి పుష్పాలను, ఎర్రటి వస్త్రాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించండి. కుదిరితే వెండి నాగపామును దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన సర్పదోషం నుంచి బయటపడవచ్చు. ఇలా చేయడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి.

సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడు?

సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 25 రాత్రి 7:12కి మొదలై, నవంబర్ 26 రాత్రి 7:43కి ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం చూసుకోవాలి. కాబట్టి నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకోవాలి. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగుతాయి. జ్ఞానం, బుద్ధి, వృద్ధి పొందడానికి మంచి రోజు.

కుజ దోషాలు

కుమారస్వామి సర్పరూపంలో భూలోకానికి ఈ మార్గశిర శుద్ధ షష్టి నాడు అడుగుపెట్టాడు. అందుకే ఈ రోజున సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. అలాగే దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్టి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిపించాడు. అందుకనే దీనిని సుబ్రహ్మణ్య షష్టి అని జరుపుతారు. దీనిని చంపా షష్టి, సుబ్రమణ్య షష్టి, సుబ్బారాయుడు షష్టి అని కూడా అంటారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe