రేపు నాగుల చవితి వేళా నాగులను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి.. నాగుల చవితి పూజా విధానం, పుట్ట దగ్గర ఎలా పూజ చెయ్యాలి?
నాగులకు ఆహారం అందజేయడం వలన నాగదోషంతో పాటు మొత్తం దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. నాగుల చవితి నాడు నాగులను పూజించడం వలన సర్వరోగాలు తొలగిపోతాయని, సౌభాగ్యవంతులవుతారని నమ్ముతారు. సర్పాలను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయట. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. దాంపత్య దోషాలు, తొలగిపోతాయని నమ్ముతారు.
రేపే నాగుల చవితి. నాగుల చవితి వేళ నాగులకు ఆహారం ఇవ్వడం వలన మంచి జరుగుతుంది. నాగులకు ఆహారం అందజేయడం వలన నాగదోషంతో పాటు మొత్తం దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే నాగుల చవితి నాడు నాగులను పూజించడం వలన సర్వరోగాలు తొలగిపోతాయని, సౌభాగ్యవంతులవుతారని నమ్ముతారు.

నాగుల చవితి 2025
నాగుల చవితిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుపుతారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక చవితిని నాడు నాగుల చవితిగా జరుపుతారు. అలాగే మరి కొంత మంది శ్రావణ శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితిని జరుపుతారు. నాగుల చవితి నాడు తక్షకుడు, వాసుకి, కర్కోటకుడు, శేషుడు వంటి 100 మంది నాగ ప్రముఖులు పుట్టారని అంటారు.
సర్పాలను పూజిస్తే మంచిది:
నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయట. అలాగే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. దాంపత్య దోషాలు, గర్భదోషాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. కుజ దోషం, కాలసర్ప దోషానికి అధినేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక పుట్టకు పూజ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. కుజదోషం ఉంటే నాగుల చవితి నాడు పూజ చేయడం ఎంతో శుభప్రదం.
నాగుల చవితి పూజా విధానం:
- నాగుల చవితి నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి.
- ఆ తర్వాత జంట నాగులకు ఆవుపాలుతో అభిషేకం చేయాలి. మళ్లీ వాటిని శుభ్రమైన నీటితో కడగాలి.
- పసుపు, కుంకుమల్లో నీళ్లు కలిపి నాగులకు అభిషేకం చేయాలి. ఆ తర్వాత మళ్లీ నీళ్లతో కడిగేయాలి.
- విగ్రహాలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. పత్తిని వస్త్రంలా చేసి కుంకుమ బొట్లు పెట్టి జంట నాగుల విగ్రహాలకు దానితో అలంకరించాలి.
- మట్టి ప్రమిదను నాగుల ముందు పెట్టి నువ్వుల నూనె ఒత్తులు వేసి దీపారాధన చేయాలి.
- తొమ్మిది రకాల నాగదేవతలు ఉంటారని 9 వత్తులతో దీపం పెడతారు.
- జిల్లేడు ఆకులో బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
పుట్ట దగ్గర ఎలా పూజించాలి?
- ముందు ఉదయాన్ని తలస్నానం చేసి, పుట్ట దగ్గరకు వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి.
- బియ్యం పిండితో అక్కడ ముగ్గు వేయాలి. ఆ తర్వాత పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి.
- పుట్టపై కొంచెం బియ్యం పిండి, కుంకుమ, పసుపు వేయాలి. తర్వాత పుట్ట చుట్టూ పువ్వులను పెట్టి అలంకరించాలి.
- పుట్ట దగ్గర దీపారాధన చేయాలి.
- చలిమిడి, చిమ్మిలిని నైవేద్యంగా పెట్టాలి. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
- ఆ తర్వాత పుట్టమన్నును చెవులకు, కంఠానికి పెట్టుకోవాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


