...
...
Next Story

రేపు యోగినీ ఏకాదశి వేళ వృషభ రాశిలోకి చంద్రుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది.. ఊహించని లాభాలు

జూలై 10న యోగిని ఏకాదశి రోజున చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ చంద్ర సంచారం వల్ల నాలుగు రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విజయాలు, శుభవార్తలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.

Published on: Jul 9, 2026, 12:30:56 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్రహాల సంచారం వల్ల శుభఫలితాలు ఎదురైతే, మరికొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రేపు యోగినీ ఏకాదశి వేళ వృషభ రాశిలోకి చంద్రుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది.. ఊహించని లాభాలు (pinterest)
రేపు యోగినీ ఏకాదశి వేళ వృషభ రాశిలోకి చంద్రుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది.. ఊహించని లాభాలు (pinterest)

చంద్రుడు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. చంద్ర సంచారంలో మార్పు వచ్చినప్పుడు కూడా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. చంద్రుడు చాలా తక్కువ సమయంలోనే ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పటికీ, ఆ ప్రభావంతో శుభఫలితాలు లేదా అశుభ ఫలితాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చంద్ర సంచారం

జూలై 10, శుక్రవారం సాయంత్రం 6:44 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజు యోగినీ ఏకాదశి కూడా. జూలై 12 వరకు, అంటే రెండు రోజుల పాటు చంద్రుడు ఇదే రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో, మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.

వృషభ రాశిలోకి చంద్రుడు.. యోగినీ ఏకాదశి వేళ ఈ నాలుగు రాశుల వారికి అద్భుతమైన లాభాలు

వృషభ రాశి

వృషభ రాశి వారికి యోగిని ఏకాదశి వేళ బాగా కలిసి వస్తుంది. చంద్రుడి రాశి మార్పు ఈ రాశి వారికి భారీ లాభాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. అదృష్టం మీ తలుపు తడుతుంది. వ్యాపారస్తులకు ఇది ఒక వరం వంటిది. సక్సెస్‌ను కూడా అందుకుంటారు. శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి చంద్ర సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. అనుకోని విధంగా లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. సోదరుల నుంచి సపోర్ట్ అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా సక్రమంగా పూర్తి చేస్తారు.

తులా రాశి

ఈ రాశి వారికి కూడా యోగిని ఏకాదశి వేళ బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఊహించని విధంగా లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు ఇది అద్భుతమైన సమయం. కొత్త ఉద్యోగాన్ని విజయవంతంగా పొందుతారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సానుకూల మార్పులు చూస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe