పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి చాలా మంది ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది చాలా విశేషమైనది. ప్రతి నెల రెండు సార్లు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి నాడు, శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి నాడు ప్రదోష వ్రతాలను ఆచరిస్తారు. శుక్రవారం వచ్చే ప్రదోష వ్రతాన్ని శుక్ర ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఇది చాలా విశేషమైన రోజు.

మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ప్రదోష వ్రతం రోజున పరమేశ్వరుడిని, పార్వతీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన ఎన్నో విధాలుగా లాభాలు కలుగుతాయి. పరమేశ్వరుడిని, పార్వతీదేవిని శుక్ర ప్రదోష వ్రతం రోజు ఆరాధించడం వలన వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా కలుగుతుంది.
అక్టోబర్ నెలలో శుక్ర ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది? పూజకు శుభ ముహూర్తం ఏంటి? ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? ఈ వివరాలను కూడా తెలుసుకుందాం.
శుక్ర ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది?
ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి అక్టోబర్ 23, శుక్రవారం ఉదయం 5:05 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 24, శనివారం తెల్లవారుజామున 4:06 గంటలకు ముగుస్తుంది. ప్రదోష వ్రతాన్ని సాయంత్రం పూట ఆచరించాలి. శివపార్వతులను పూజించాలి. ప్రదోష కాలంలో పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే, ఆ సమయంలో శివుడికి అభిషేకం చేస్తే కూడా మంచిది.
ప్రదోష వ్రతం పూజ ఏ సమయంలో చేయాలి?
పూజ సాయంత్రం 6:19 నుంచి రాత్రి 8:56 వరకు చేయొచ్చు. అయితే, సూర్యాస్తమయ సమయం మీ ప్రాంతాన్ని బట్టి మారొచ్చు. కాబట్టి స్వల్ప తేడాలు ఉంటాయి, గమనించండి.
శుక్ర ప్రదోష వ్రతం పూజా విధానం
ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, శివుని స్మరిస్తూ ఉపవాస దీక్షను తీసుకోవాలి.
{{/usCountry}}ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, శివుని స్మరిస్తూ ఉపవాస దీక్షను తీసుకోవాలి.
{{/usCountry}}ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫలాహారం తీసుకోవచ్చు.
సాయంత్రం శివుడికి గంగాజలం, నీటితో అభిషేకం చేయాలి. అలాగే, పరమేశ్వరుడికి పెరుగు, పాలు, తేనె, చక్కెర, పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
శివుడికి బిల్వపత్రాలు, తెల్లటి పూలు కూడా సమర్పించండి. పాయసం, తెల్లటి స్వీట్లు వంటివి నైవేద్యంగా పెట్టొచ్చు.
శివుడి ముందు దీపం వెలిగించి, ప్రదోష వ్రత కథను కూడా చదువుకోవాలి.
శుక్ర ప్రదోష వ్రతం నాడు శివపార్వతులను పూజించడం వలన వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి, సుఖసంతోషాలు కలుగుతాయి. “ఓం గౌరీశంకరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే, “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని కూడా జపించండి.
రాగి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు, గంగాజలం, పాలు కలిపి శివుడికి సమర్పించి, ఈ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ శుక్ర ప్రదోష వ్రతం నాడు శివుని ఆరాధించడం మంచిది.