...
...
Next Story

రేపే దుర్గాష్టమి.. అమ్మ అనుగ్రహం కోసం ఉపవాసం, పూజ నుంచి రాహుకాల దీపాల వరకు ఏమేం చెయ్యాలో తెలుసుకోండి!

దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైన దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని, పూజగదిని అలంకరించి అమ్మవారిని ఆరాధించాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించి, మందార పూలు, గులాబీలు సమర్పించాలి.

Published on: Oct 17, 2026, 16:00:34 IST
Advertisement

దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాము. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం, ఇష్టమైన పూలు సమర్పించడం వంటివి పాటిస్తూ ఉంటాము. అలాగే, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తాము.

రేపే దుర్గాష్టమి.. అమ్మ అనుగ్రహం కోసం ఉపవాసం, పూజ నుంచి రాహుకాల దీపాల వరకు ఏమేం చెయ్యాలో తెలుసుకోండి! (AI)
రేపే దుర్గాష్టమి.. అమ్మ అనుగ్రహం కోసం ఉపవాసం, పూజ నుంచి రాహుకాల దీపాల వరకు ఏమేం చెయ్యాలో తెలుసుకోండి! (AI)

కొన్ని మంత్రాలను కూడా చాలామంది ఈ నవరాత్రుల సమయంలో పఠిస్తారు. అయితే, ఈ నవరాత్రుల్లో శక్తివంతమైన రోజుల్లో దుర్గాష్టమి కూడా ఒకటి. దుర్గాష్టమి నాడు అమ్మవారిని ప్రత్యేకించి పూజించడం వలన అఖండ రాజయోగం కలుగుతుంది. దుర్గాష్టమి ఎప్పుడు వచ్చింది ? ఆ రోజు ఏం చేయాలి? ఇలాంటి వివరాలను తెలుసుకుందాం.

దుర్గాష్టమి 2026

నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి. దుర్గాష్టమి అక్టోబర్ 18, ఆదివారం, అంటే రేపు వచ్చింది. రేపు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దుర్గాష్టమి నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దుర్గాష్టమి పూజా విధానం, పాటించాల్సిన నియమాలు

దుర్గాష్టమి రోజు ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారిని పూజించాలి. ఎవరైతే దుర్గాష్టమి నాడు అమ్మవారిని పూజిస్తారో, వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వారి జన్మ ధన్యమవుతుంది.

ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసి, ఇంటి ముందు ముగ్గు వేసుకుని, పూజగదిని అందంగా అలంకరించుకుని, శుభ్రం చేసుకుని పూజ చేయాలి. దుర్గాదేవి రూపంలో అమ్మవారిని అలంకరించాలి.

దుర్గాష్టమి నాడు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఎరుపు రంగు అమ్మవారికి ఇష్టమైన రంగు కూడా.

అలాగే, అమ్మవారికి ఎరుపు రంగు మందార పూలను సమర్పించండి. ఇలా చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కుదిరితే ఎర్రటి గులాబీలను కూడా అమ్మవారికి సమర్పించడం మంచిదే.

అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు కాళ్లకు పసుపు రాసుకుని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని, ముత్తయిదువులాగా తయారయ్యి అమ్మవారిని ఆరాధించండి. ఇలా చేయడం వలన అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.

పిండి దీపాలను వెలిగిస్తే మంచిది

అమ్మవారికి ఇష్టమైన పులగం, పరమాన్నం వంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు.

దుర్గాష్టమి నాడు ఈ మంత్రాన్ని జపించండి

దుర్గాష్టమి నాడు “ఓం ధూం దుర్గాయై నమః” మంత్రాన్ని 108 సార్లు జపించండి. అన్ని సార్లు చదవలేకపోతే 21 సార్లు జపించడం మంచిదే. దీంతో అమ్మ దయ మీపై ఉంటుంది. అమ్మ అనుగ్రహంతో కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది.

కుదిరితే ఉపవాసం ఉండండి

దుర్గాష్టమి నాడు పూజ చేసి ఉపవాసం ఉంటే మంచిది. ఒకవేళ ఉపవాసం ఉండకపోతే, సాత్విక ఆహారాన్ని తీసుకోండి. అలా కూడా చేయలేకపోతే, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండి ఆహారాన్ని యథావిధిగా తీసుకోవచ్చు. భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని దుర్గాష్టమి నాడు ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

నిమ్మకాయల మాల

దుర్గాష్టమి నాడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయల మాలను సమర్పించండి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి మీరు నిమ్మకాయల మాలను సమర్పించొచ్చు. గుమ్మానికి నిమ్మకాయలను కట్టడం కూడా మంచిదే. చెడు శక్తులను బయటకు పంపించి, దుర్గాదేవి ఇంట అడుగుపెట్టేలా చేస్తుందని నమ్ముతారు.

స్వస్తిక్ గుర్తు వేయండి

దసరా నవరాత్రుల్లో ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేయండి. సంవత్సరం అంతా కష్టాలు కలగకుండా ఉంటాయని నమ్ముతారు.

రాహుకాల దీపాలు

దుర్గాష్టమి ఆదివారం నాడు వచ్చింది కాబట్టి, రాహుకాల దీపాన్ని వెలిగిస్తే మంచిది. నిమ్మకాయలలో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలు అంటారు. కాబట్టి, రాహుకాల దీపాలను అమ్మవారి ఆలయంలో వెలిగిస్తే మంచిది.

ఎరుపు రంగు చీర సమర్పించండి

దుర్గాష్టమి నాడు స్త్రీలు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అమ్మవారికి ముదురు ఎరుపు రంగు చీరను సమర్పిస్తే మంచిదే. ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

ప్రమోషన్ రావాలంటే ఈ పరిహారాన్ని పాటించండి

చాలా కాలంగా ప్రమోషన్ రాకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే, అమ్మవారికి పచ్చ కర్పూరాన్ని సమర్పించండి. ఈ పచ్చ కర్పూరాన్ని ఆలయంలో వినియోగిస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks