...
...
Next Story

తులసి పూజలో ఈ నియమాలు పాటిస్తే.. ఇంట్లో శాంతి, సానుకూలత.. తులసి దళాలను దేవుడికి సమర్పించేటప్పుడు ఈ విషయాలు పాటించండి!

హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి కోట వద్ద దీపం వెలిగించి పూజ చేయడం ఆధ్యాత్మికంగా విశిష్టమైనదిగా భావిస్తారు. విష్ణువు, కృష్ణుడు, శ్రీరాముడు వంటి విష్ణు స్వరూపాలకు తులసి దళాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.

Published on: Sep 22, 2026, 12:30:58 IST
Advertisement

హిందువులు తులసి మొక్కను పూజిస్తారు. తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తులసిని హిందూ ధర్మంలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. విష్ణువు, కృష్ణుడు, శ్రీరాముడు లాంటి విష్ణు స్వరూపాలకు తులసి దళాలను సమర్పించడం చాలా మంచిదే.

తులసి ఆకులను కోసేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించండి

తులసి పూజలో ఈ నియమాలు పాటిస్తే.. ఇంట్లో శాంతి, సానుకూలత.. తులసి దళాలను దేవుడికి సమర్పించేటప్పుడు ఈ విషయాలు పాటించండి! (AI)
తులసి పూజలో ఈ నియమాలు పాటిస్తే.. ఇంట్లో శాంతి, సానుకూలత.. తులసి దళాలను దేవుడికి సమర్పించేటప్పుడు ఈ విషయాలు పాటించండి! (AI)

తులసి ఆకులను కోయడానికి ముందు శుభ్రంగా స్నానం చేసి, మంచి దుస్తులు ధరించండి. ఆకులను కోసేటప్పుడు మొక్కకు నష్టం కలగకుండా చూసుకోవాలి. వేళ్లతో మృదువుగా ఆకులను త్రుంచాలి. కొమ్మలను విరిచేయడం, మొక్కను గాయపరచడం మంచిది కాదు. అలాగే తులసి ఆకులను భక్తిశ్రద్ధలతో తీసుకుని పూజకు ఉపయోగించాలి.

సూర్యోదయం తర్వాత ఉదయం సమయంలో తులసి దళాలను సేకరించడం మంచిది. సాయంత్రం, రాత్రిపూట తులసి ఆకులను కోయకూడదని ఆచారం ఉంది. కొన్ని సంప్రదాయాల ప్రకారం చూస్తే ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి లాంటి ప్రత్యేక సందర్భాల్లో తులసి దళాలను కోయకూడదు అని అంటారు.

ఏకాదశి రోజు కూడా తులసి ఆకులను కోయడం, తులసి మొక్కకు నీటిని సమర్పించడం మంచిది కాదు. తులసి దళాలను ఏకాదశి నాడు విష్ణువుకు సమర్పించాలంటే, ముందు రోజే కోసుకొని ఉంచుకోవాలి. శుభ్రమైన పాత్రలో నిల్వ చేసుకోవాలి.

విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను అందులో ఉంచండి. ఇంటి తులసి కోట నుంచి తులసి ఆకులను ఎంతో భక్తిశ్రద్ధలతో కోసి దేవుడికి సమర్పిస్తే, ఖచ్చితంగా విష్ణు అనుగ్రహం కలుగుతుంది.

ఎండిపోయిన తులసి ఆకులను ఏం చేయాలి?

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దీపం వెలిగించేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోండి. తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు మొక్కకు లేదా ఆకులకు మంట తగలకుండా చూసుకోండి.

తులసి మొక్కను ఎలా సంరక్షించాలి?

తులసి మొక్కను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఈ మొక్క చుట్టూ చెత్త, ఎండిపోయిన ఆకులు లేకుండా చూసుకోవాలి. తులసి మొక్కకు తగినంత సూర్యరశ్మి, గాలి అందేటట్టు చూసుకోండి.

తులసి దళాలను ఎలా సమర్పించాలి?

తులసి దళాలను సమర్పించేటప్పుడు శుభ్రంగా, భక్తితో సమర్పించేటట్టు చూసుకోవాలి. విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించేటప్పుడు తులసి దళాలను నైవేద్యంపై పెట్టి, ఆ తర్వాత నివేదన చేయండి. తులసిని కేవలం పూజా సామగ్రిగా కాదు, పవిత్రతకు ప్రతీకగా భావించి సంరక్షించడం చాలా ముఖ్యమైనది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks