ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి తులసి మొక్క ఉన్నచోట ఉంటుందని కూడా నమ్మకం. తులసి మొక్కను రోజూ పూజించి, ప్రతి రోజూ దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తుంచకూడదు. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. తులసి ఆకులు కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోయడం, తులసి ఆకులను తుంచడం వంటివి చేయకూడదు.
తులసి ఆకులను ఎప్పుడు కోస్తే మంచిది?
తులసి ఆకులను కోయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, తులసి ఆకులను స్నానం చేసిన తర్వాత మాత్రమే కోయాలి. ఆకులను కోసి వృథా చేయకూడదు. ఎన్ని తులసి దళాలు అవసరమో అన్ని మాత్రమే కోసుకోవాలి.
తులసి ఆకులను పొరపాటున కూడా ఈ రోజుల్లో తెంపకండి
ఆదివారం తులసి ఆకులను కోయకూడదు. అలాగే ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా తులసి ఆకులను కోయకూడదు. శుక్రవారం కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు. తులసి ఆకులను కోసేటప్పుడు "ఓం తులస్యే నమః" అనే మంత్రం జపించండి.
మొక్క ఎండిపోతే ఏం చెయ్యాలి?
మొక్క పూర్తిగా ఎండిపోయినప్పటికీ, ఆ ఆకులలో ఉండే పవిత్రత నిలిచి ఉంటుంది. అందుకని ఎండిన తులసి ఆకులను లేదా మొక్కను ఎప్పుడూ చెత్తలో పడేయద్దు. ఆకులు ఎండిపోతే శుభ్రమైన నీటిలో నానబెట్టి పూజలకు లేదా ఇతర అవసరాలకు వాడడం మంచిది.
తులసి ఆకులను కోసే విధానం
తులసి ఆకులను కోసేటప్పుడు జాగ్రత్తగా చేతి వేళ్లతో తెంపాలి. గోరు తగలకూడదు. మొక్కకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిశుభ్రమైన, శుభ్రం లేని ప్రదేశంలో తులసి మొక్క ఉండకూడదు. అలాంటి ప్రదేశంలో ఉన్న తులసి ఆకులను కోసి దేవుడికి సమర్పించకూడదు.
{{/usCountry}}తులసి ఆకులను కోసేటప్పుడు జాగ్రత్తగా చేతి వేళ్లతో తెంపాలి. గోరు తగలకూడదు. మొక్కకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిశుభ్రమైన, శుభ్రం లేని ప్రదేశంలో తులసి మొక్క ఉండకూడదు. అలాంటి ప్రదేశంలో ఉన్న తులసి ఆకులను కోసి దేవుడికి సమర్పించకూడదు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.