తులసి మొక్కకు ఈ మంత్రంతో నీరు పోస్తే.. దరిద్రం తొలగి సిరిసంపదలు కలుగుతాయి!
అత్యంత పవిత్రమైన తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా, శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం భక్తిశ్రద్ధలతో తులసికి నీరు సమర్పిస్తూ "మహాప్రసాద జననీ..." లేదా "ఓం శ్రీ తులస్యే నమః" మంత్రాన్ని జపించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యున్నత స్థానం ఉంది. ఈ పవిత్ర మొక్కలో సాక్షాత్ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, శ్రీమహావిష్ణువుకు ఇది ఎంతో ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. అందుకే ప్రతి విష్ణు పూజలోనూ తులసి ఆకులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజూ ఉదయం తులసి మాతకు నీరు సమర్పించడం వల్ల ఇంట సానుకూల శక్తి వ్యాపించి, ఆర్థిక వృద్ధి కలుగుతుంది.

అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది. అయితే, తులసికి నీరు పోసే సమయంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించడంతో పాటు నిర్దిష్టమైన మంత్రాలు జపించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
తులసికి నీరు సమర్పించేటప్పుడు జపించాల్సిన మంత్రాలు
మత విశ్వాసాల ప్రకారం, తులసికి జలసమర్పణ చేసే వేళ కొన్ని మంత్రాలను పఠించడం అత్యంత శుభప్రదం.
మహాప్రసాద జననీ సర్వ సౌభాగ్య వర్ధినీ।
ఆధి వ్యాధి హరా నిత్యం తులసీ త్వం నమోస్తుతే
సకల సౌభాగ్యాలను ప్రసాదించే తులసి దేవి సమస్త రోగాలను, బాధలను హరించే నీకు నా నమస్కారాలు" అని అర్థం. ఈ సంస్కృత మంత్రం చదవడం కష్టంగా భావించేవారు 'ఓం శ్రీ తులస్యే నమః' అనే మంత్రాన్ని మూడు సార్లు భక్తిశ్రద్ధలతో ఉచ్చరిస్తూ నీరు పోయవచ్చు.
తులసి పూజకు సరైన సమయం, పద్ధతులు
తులసికి నీరు పోయడానికి ఉదయం పూటే అత్యంత అనుకూలమైన సమయం. సూర్యోదయానంతరం తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించిన తర్వాతే తులసి పూజ చేయాలి. ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
తప్పనిసరిగా రాగి చెంబుతోనే తులసికి నీటిని సమర్పించాలి. జలసమర్పణ చేసే సమయంలో మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. నీరు పోసిన తర్వాత తులసికి కుంకుమ, అక్షతలు సమర్పించి, దీపం వెలిగించి ప్రదక్షిణ చేయాలి.
ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
ఆదివారం మరియు ఏకాదశి రోజులలో తులసి మొక్కకు పొరపాటున కూడా నీరు పోయకూడదు.
ఉదయాన్నే స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కను ముట్టుకోకూడదు.
తులసి కుండీలో అవసరానికి మించి నీటిని పోయడం వల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.
ఎలాంటి అవసరం లేకుండా తులసి ఆకులను తుంచకూడదు. అత్యవసర సమయాల్లో మాత్రమే నియమాలను పాటించి ఆకులను తీసుకోవాలి.
నిరాకరణ- ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


