...
...
Next Story

Ugadi Simha rasi Horoscope: ఉగాది నుంచి సింహ రాశికి ఎలా ఉంటుంది? మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు నెలల వారీగా ఫలితాలు

పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. మరి సింహ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం.

Published on: Mar 13, 2026, 12:01:17 IST
Advertisement

ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న రాబోతుంది. ఆ రోజు నుంచి కూడా పరాభవనామ సంవత్సరం మొదలవుతుంది. విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలికి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. మరి సింహ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పరాభవ నామ సంవత్సరం సింహ రాశి వారి ఫలితాలు:

Ugadi Simha rasi Horoscope: ఉగాది నుంచి సింహ రాశికి ఎలా ఉంటుంది? (pinterest)
Ugadi Simha rasi Horoscope: ఉగాది నుంచి సింహ రాశికి ఎలా ఉంటుంది? (pinterest)

ఈ రాశి వారికి గురువు జూన్ 1 దాకా లోహమూర్తిగా ఉండడంతో సామాన్య ఫలితాలు కలుగుతాయి. జూన్ 2 నుంచి కూడా సౌభాగ్యకరంగా ఉంటుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. 2026 డిసెంబర్ 5 దాకా రాహు కేతువులు అష్టమ, అద్వితీయ స్థానంలో ఉండడంతో విశేష ఫలితాలు కలుగుతాయి. డిసెంబర్ 6 నుంచి తామరమూర్తులుగా ఉండడంతో సామాన్య ఫలితాలు కలుగుతాయి. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. అలాగే ఈ కొత్త సంవత్సరం బంధుమిత్రుల కలయికతో సంతోషంగా సాగుతుంది.

వృత్తి, వ్యాపారాల్లో బాగా అభివృద్ధి

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవనంతో శుభ ఫలితాలు కలుగుతాయి. స్వదేశంలో స్థిరాస్తులను సమకూరుస్తారు. అలాగే సింహ రాశి వారు కొత్త తెలుగు సంవత్సరంలో వృత్తి, వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని చూస్తారు. పనులు కాస్త ఆలస్యం అవ్వచ్చు. వ్యయ స్థానంలో గురువు ఉండడంతో సంతానం చదువుల్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను చూస్తారు. మత్స్య సంబంధిత వ్యాపారస్తులకు విదేశీ విక్రయాలు, ధన లాభాలు కలుగుతాయి. రాహు సంచారం సప్తమ స్థానంలో ఉండడంతో సామాజిక గుర్తింపు తగ్గుతుంది, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది.

ఈ నెలలో ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈ నెలలో ఆధ్యాత్మిక భావంతో సాధుసంపత్తిని కలుగుపొందుతారు. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు.

ఏప్రిల్ 2026

బంధువుల ఆదరణ పెరుగుతుంది. ఐటీ సంబంధిత ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. ధనవ్యయం ఉంటుంది.

మే 2026

ఈ నెలలో వృత్తి జీవితం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. ఆర్థికపరంగా పరపతి పెరుగుతుంది.

జూన్ 2026

వృత్తి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. ప్రశంసలను పొందుతారు. కొత్తదనంతో అన్నింటిని మొదలు పెడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

జూలై 2026

దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కంటి సంబంధిత సమస్యలు ఉండొచ్చు. కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మనోబలం బాగా తగ్గుతుంది. ప్రభుత్వ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది.

ఆగస్టు 2026

నెలలో ఈ రాశి వారికి లాభాలు కలుగుతాయి. మొదటి వారంలో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు ఉంటాయి. ధన సంపాదన పెరుగుతుంది. అహంకారం కాస్త తగ్గితే మంచిది.

సెప్టెంబర్ 2026

అందం, వినోదాలు, కలలు వంటి వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమపూర్వకంగా అందర్నీ ఆదరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. బహుమతులు కూడా వస్తాయి.

అక్టోబర్ 2026

ఇతరుల సృజనాత్మకత, నైపుణ్యాన్ని గుర్తించి వారిని బాగా ప్రోత్సహిస్తారు. సృజనాత్మక రంగాల్లో ఈ నెల పురోగతిని చూస్తారు.

నవంబర్ 2026

అనవసరంగా తొందరపడి మాట్లాడకండి. కోపం వలన ఇతరులు బాధపడతారు. ఆకస్మిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన వృద్ధి కలుగుతుంది.

డిసెంబర్ 2026

ఈ నెలలో మీరు మీ ధైర్యసహసాలతో ఇతరులను ఆకట్టుకుంటారు. అన్ని మీకు అనుకూలంగా ఉంటాయి. మాట్లాడే మాటలకు, చేసే వాటికి సంబంధం లేకుండా ఉంటుంది.

జనవరి 2027

మీరు చేసే పనులు దైవ బలంతో సంపూర్ణమవుతాయి. ఇతరులకు సహకారం అందిస్తారు. గృహ, వాహన సౌఖ్యాలను ఈ నెలలో పొందుతారు.

ఫిబ్రవరి 2027

ఈ నెలలో పోలీసు, సైన్యం వంటి రంగాల్లో ఉన్నత స్థానాలను పొందుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది.

మార్చి, ఏప్రిల్ 2027

డబ్బు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. వైద్య సహాయం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సమస్యల నుంచి కాస్త బయటపడతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe