గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో శుభ యోగాలు ఏర్పడడం సహజం. దీపావళి సందర్భంగా కూడా ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడిపోతోంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రమే ఎక్కువ లాభాలను పొందుతారు.
దీపావళి 2025

ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటాము. ఈసారి దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. ఆ రోజు చంద్రుడు–శుక్రుల సంయోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక లాభాలను పొందుతారు.
వైభవలక్ష్మి రాజయోగం
అక్టోబర్ 18 అంటే రేపు చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 21న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ దీపావళికి శుక్రుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడంతో వైభవలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుంది.
ఈ నాలుగు రాశుల వారు ఈ రెండు గ్రహాల సంయోగంతో శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏ రాశుల వారు వైభవలక్ష్మి రాజయోగంతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారో, ఎవరికి ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దీపావళికి వైభవలక్ష్మి రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారం
1.కన్య రాశి:
కన్య రాశి వారికి శుక్రుడు,చంద్రుల కలయిక శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. పాత ప్రాజెక్టులు పూర్తవుతాయి, సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సానుకూల మార్పులను చూస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. శుభవార్తలను కూడా వింటారు.
2.తులా రాశి:
తులా రాశి వారు వైభవలక్ష్మి రాజయోగంతో శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రశాంతతను పొందుతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పనికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి.
3.మకర రాశి:
{{/usCountry}}తులా రాశి వారు వైభవలక్ష్మి రాజయోగంతో శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రశాంతతను పొందుతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పనికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి.
3.మకర రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి ఈ సమయం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. దీపావళి సందర్భంగా సానుకూల మార్పులను చూస్తారు. కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది శుభ సమయం. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. ఆర్థికపరంగా బావుంటుంది. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు శుభ ఫలితాలను అందుకుంటారు.
4.కుంభ రాశి:
కుంభ రాశి వారికి వైభవలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సంతోషం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.