దీపావళి నాడు శక్తివంతమైన వైభవ లక్ష్మీ రాజయోగం, వీళ్ళు మట్టి పట్టుకున్నా బంగారంగా మారుతుంది.. ఆ అదృష్ట రాశులు ఎవరంటే?
అక్టోబర్ 18 అంటే రేపు చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 21న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ దీపావళికి శుక్రుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడంతో వైభవలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో శుభ యోగాలు ఏర్పడడం సహజం. దీపావళి సందర్భంగా కూడా ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడిపోతోంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రమే ఎక్కువ లాభాలను పొందుతారు.

దీపావళి 2025
ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటాము. ఈసారి దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. ఆ రోజు చంద్రుడు–శుక్రుల సంయోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక లాభాలను పొందుతారు.
వైభవలక్ష్మి రాజయోగం
అక్టోబర్ 18 అంటే రేపు చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 21న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ దీపావళికి శుక్రుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడంతో వైభవలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుంది.
ఈ నాలుగు రాశుల వారు ఈ రెండు గ్రహాల సంయోగంతో శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏ రాశుల వారు వైభవలక్ష్మి రాజయోగంతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారో, ఎవరికి ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దీపావళికి వైభవలక్ష్మి రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారం
1.కన్య రాశి:
కన్య రాశి వారికి శుక్రుడు,చంద్రుల కలయిక శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. పాత ప్రాజెక్టులు పూర్తవుతాయి, సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సానుకూల మార్పులను చూస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. శుభవార్తలను కూడా వింటారు.
2.తులా రాశి:
తులా రాశి వారు వైభవలక్ష్మి రాజయోగంతో శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రశాంతతను పొందుతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పనికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి.
3.మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. దీపావళి సందర్భంగా సానుకూల మార్పులను చూస్తారు. కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది శుభ సమయం. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. ఆర్థికపరంగా బావుంటుంది. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు శుభ ఫలితాలను అందుకుంటారు.
4.కుంభ రాశి:
కుంభ రాశి వారికి వైభవలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సంతోషం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


