...
...
Next Story

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? తేదీ, విశిష్టతతో పాటు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి!

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయి, మోక్షం కూడా లభిస్తుందని నమ్మకం. ఈసారి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం.

Published on: Nov 27, 2025, 10:40:14 IST
Advertisement

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. విష్ణు పురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయి, మోక్షం కూడా లభిస్తుందని నమ్మకం. ఈసారి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి 2025

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? (pinterest)
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? (pinterest)

శేషతల్పం పై శయనించి విష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి ముక్కోటి దేవతలతో పాటు స్వామి వారు భూలోకానికి వచ్చే శుభ సందర్భం. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, ఎంతో మంచి జరుగుతుందని, శుభ ఫలితాలను పొందవచ్చని చెబుతారు. వైకుంఠ ఏకాదశిని (Vaikunta ekadashi 2025) ముక్కోటి ఏకాదశి (Mukkoti ekadashi) అని కూడా అంటారు.

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2025 తేదీ, సమయం

ఏకాదశి తిధి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 కి మొదలవుతుంది. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి. కనుక వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 3:30 నుంచి వైష్ణవాలయాల్లో ద్వారదర్శనాలు మొదలవుతాయి.

తిరుమలలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి

తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనాన్ని చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు ఏకాంత సేవ జరుగుతుంది. ఆ తర్వాత బంగారు వాకిలిని మూసివేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలు ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి నాడు ఏకాంత సేవ దాకా ఆలయ గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. పది రోజులు పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది.

శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి

మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకని ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అష్టాదశ పురాణాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయి.

వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి?

  1. వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి.
  2. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం ఉంటే ఎంతో మంచిది.
  3. దామోదర సహిత తులసీదేవిని పూజించాలి.
  4. ఉపవాసం చేసేవారు ఆహారం తీసుకోకుండా ఉండడంతో పాటుగా ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకోవాలి.
  5. నిష్టగా ఏకాదశి ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది.
  6. ఈ ముక్కోటి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe