వారాహి నవరాత్రుల్లో కూష్మాండ, బెల్లం, పంచగవ్య ఇలా ఈ 9 దీపాలు వెలిగిస్తే.. అమ్మవారి విశేష కటాక్షం, శుభ ఫలితాలు మీ సొంతం!
వారాహి నవరాత్రుల్లో ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు? కంద దీపం, నారికేళ దీపం, పంచగవ్య దీపం, పిండి దీపం, జల దీపం, ఐశ్వర్య ఉప్పు దీపం, బెల్లం దీపం, కూష్మాండ దీపం, నవధాన్యాల దీపం ప్రాముఖ్యతతో పాటు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఆషాఢ మాసంలో ప్రతి ఏటా వారాహి నవరాత్రులను జరుపుకుంటాము. ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అనేక విధాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వారాహి నవరాత్రుల సమయంలో ఈ విశేషమైన దీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. మరి వారాహి నవరాత్రుల సమయంలో ఏ దీపాన్ని వెలిగించాలి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వారాహి నవరాత్రుల సమయంలో ఈ విశేషమైన దీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు
కంద దీపం
కంద దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ముందుగా ఒక కంద దుంపను తీసుకుని, పైభాగాన్ని కోసి, పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యి వేసి, ఒత్తులు పెట్టి, ఏకహారతి లేదా అగర్బత్తితో ఈ కంద దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని ఇలా వెలిగించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది.
నారికేళ దీపం
నారికేళ దీపం కూడా చాలా శక్తివంతమైనది. చాలా మంది విశేషమైన రోజుల్లో, పర్వదినాల్లో దీనిని వెలిగిస్తూ ఉంటారు. వారాహి నవరాత్రుల్లో నారికేళ దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబంలో శుభ ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం పెరుగుతుంది. దృష్టి దోష నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుందని నమ్మకం.
పంచగవ్య దీపం
పంచగవ్య దీపం వెలిగిస్తే కూడా అనేక విధాలైన ప్రయోజనాలను పొందవచ్చు. వారాహి నవరాత్రులలో పంచగవ్య దీపాన్ని వెలిగించడం వల్ల గృహ శుద్ధి, దైవ అనుగ్రహం కలుగుతాయి. పాపాలన్నీ కూడా తొలగిపోతాయని విశ్వసిస్తారు.
పిండి దీపం
పిండి దీపం వెలిగిస్తే కూడా మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఈ నవరాత్రుల సమయంలో ఈ దీపాన్ని వెలిగిస్తే అన్నపూర్ణ దేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. అలాగే ధాన్య సమృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పొందడానికి వీలవుతుంది.
జల దీపం
వారాహి నవరాత్రుల సమయంలో జల దీపాన్ని వెలిగిస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మనశ్శాంతిని కూడా పొందవచ్చు.
ఐశ్వర్య ఉప్పు దీపం
ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగిస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. వారాహి నవరాత్రుల్లో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల దరిద్రం తొలగిపోతుంది. ధనలాభం, ఐశ్వర్యం కలుగుతాయి.
బెల్లం దీపం
బెల్లంతో దీపాన్ని వెలిగిస్తే కూడా మంచిదే. కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. కలహాలు తొలగిపోతాయి. మధుర సంబంధాలు ఏర్పడతాయి. కాబట్టి వారాహి నవరాత్రుల సమయంలో బెల్లం దీపాన్ని కూడా వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.
కూష్మాండ దీపం
కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయతో చేసే దీపారాధన. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. గృహ రక్షణ, విజయప్రాప్తిని పొందవచ్చని విశ్వసిస్తారు. కాబట్టి నవరాత్రుల్లో ఈ దీపాన్ని కూడా వెలిగించేటట్లు చూసుకోండి.
నవధాన్యాల దీపం
నవధాన్యాలతో వారాహి నవరాత్రుల సమయంలో దీపాన్ని వెలిగించడం వల్ల నవగ్రహ కృప కలుగుతుంది. సంపద పెరుగుతుంది. సర్వతోముఖ అభివృద్ధిని చూడొచ్చు.
ఇలా వారాహి నవరాత్రుల సమయంలో ఈ విశేషమైన దీపాలను వెలిగించడం వల్ల బాగా కలిసి వస్తుందని, అనేక విధాలుగా శుభ ఫలితాలను పొందవచ్చని విశ్వసిస్తారు. కాబట్టి నవరాత్రులను సద్వినియోగం చేసుకుని, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, పరిహారాలను పాటిస్తూ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కాలని పెద్దలు సూచిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


