వాస్తు ప్రకారం డైనింగ్ హాల్‌లో ఈ నియమాలు పాటించండి.. ఇంట్లో సానుకూల శక్తి, కుటుంబంలో సంతోషం!

వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ హాల్‌ను సరైన దిశలో ఏర్పాటు చేయడం, తగిన రంగులను ఎంచుకోవడం, డైనింగ్ టేబుల్‌ను సరైన ప్రదేశంలో ఉంచడం ముఖ్యమని చెబుతారు. డైనింగ్ హాల్‌కు పశ్చిమ దిశ అనుకూలంగా ఉంటుందని, తూర్పు లేదా ఉత్తర దిశలు కూడా అనుకూలమని పేర్కొంటారు. 

Published on: Oct 7, 2026, 16:00:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ప్రతి గది, ప్రతి మూలలో వాస్తు ప్రకారం ఏ విధంగా ఉండాలో చూసుకుని, దాని ప్రకారం నడుచుకుంటారు. అయితే వాస్తు ప్రకారం డైనింగ్ హాల్ విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు నియమాలను పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఇక డైనింగ్ హాల్లో ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం డైనింగ్ హాల్‌లో ఈ నియమాలు పాటించండి.. ఇంట్లో సానుకూల శక్తి, కుటుంబంలో సంతోషం! (AI)
వాస్తు ప్రకారం డైనింగ్ హాల్‌లో ఈ నియమాలు పాటించండి.. ఇంట్లో సానుకూల శక్తి, కుటుంబంలో సంతోషం! (AI)

వాస్తు ప్రకారం డైనింగ్ హాల్ విషయంలో పాటించాల్సిన నియమాలు

వాస్తు శాస్త్రంలో ప్రతి గదికి, ప్రతి మూలకి పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. డైనింగ్ హాల్ విషయంలో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

గోడల రంగులు

డైనింగ్ హాల్‌కు పసుపు లేదా ఆకుపచ్చ లేదా క్రీమ్ రంగులు శుభప్రదమైన ఫలితాలను అందిస్తాయి. సానుకూల శక్తి కూడా పెరిగేందుకు సహాయపడుతుంది.

డైనింగ్ టేబుల్ ఆకారం

డైనింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ఇంటి మధ్య భాగంలో పెట్టకండి. పశ్చిమ లేదా తూర్పు వైపు ఉంచొచ్చు. డైనింగ్ టేబుల్ ఆకారం దీర్ఘచతురస్రాకారంగా లేదా చతురస్రాకారంలో ఉంటే మంచిది.

డైనింగ్ హాల్ దిశ

వాస్తు ప్రకారం డైనింగ్ హాల్ ఎప్పుడూ పశ్చిమ వైపు ఉండడం మంచిది. అలాగే తూర్పు లేదా ఉత్తర దిశలో కూడా ఉండొచ్చు. దక్షిణ, నైరుతి దిశలో మాత్రం డైనింగ్ హాల్ ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశలో భోజనానికి అనుకూలంగా ఉండవు.

భోజనం చేసేటప్పుడు ఏ దిశలో కూర్చుంటే మంచిది?

డైనింగ్ హాల్లో భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా పశ్చిమం వైపు ముఖం పెట్టి కూర్చుని తింటే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందని జ్యోతిష్య నిపుణులు, వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.

టేబుల్ గోడకి తగిలేలా పెట్టకండి

డైనింగ్ టేబుల్‌ను ఎప్పుడూ కూడా గోడకు అతుక్కునేలా పెట్టకూడదు. గోడకు, టేబుల్‌కు మధ్య కొంచెం ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి.

ఫ్రిడ్జ్, అద్దాలు విషయంలో ఎలాంటి నియమాలను పాటించాలి?

అద్దాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవడం మంచిది

ఈ డైనింగ్ టేబుల్‌కు ఎదురుగా తూర్పు లేదా ఉత్తర గోడపై అద్దం అమర్చడం శుభప్రదం. అద్దంలో భోజనంతో ఉన్న ప్లేట్ కనిపిస్తే సిరిసంపదలు పెరుగుతాయి.

ఫ్రిడ్జ్ దిశ

ఫ్రిడ్జ్ ఏ వైపు ఉండాలి అనే విషయానికి వస్తే, ఆగ్నేయం శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తుంది. ఇది చాలా ఉత్తమమైన దిశ. తూర్పు లేదా పశ్చిమ దిశల్లో కూడా ఫ్రిడ్జ్‌ను పెట్టుకోవచ్చు. కానీ ఈశాన్యం, నైరుతి మూలలో ఫ్రిడ్జ్‌ను ఉంచకండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More