చాలా మంది ఇళ్లల్లో నచ్చిన మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. మొక్కలు కేవలం అందానికే కాక, కొన్ని రకాల దోషాలను తొలగించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, సానుకూల శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ మొక్కలు ఉన్నట్లయితే ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

వాస్తు ప్రకారం పాటిస్తే చాలా ఇబ్బందులను తొలగించేందుకు వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా ఏర్పడుతుంది. ప్రతికూల శక్తి పూర్తిగా తొలగి పోతుంది. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంటుంది. కుజ దోషం, రాహు, కేతువుల దోషం, సూర్య దోషం, మాంగల్య దోషం, పుత్ర దోషం వంటివి కూడా తొలగిపోతాయి.
ఈ మొక్కలను పెంచితే దోషాలు తొలగిపోతాయి, వివాహం కూడా అవుతుంది
1.అరటి చెట్టు
ఇంట్లో అరటి చెట్టుని నాటడం వలన వివాహంలో అడ్డంకులు తొలగి పోతాయి. ఆనందంగా ఉండొచ్చు. అరటి చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఇది సానుకూల శక్తిని కూడా తీసుకు వస్తుంది. పెళ్లి అవ్వక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మొక్క ఎంతో సహాయ పడుతుంది. వివాహానికి సంబంధించిన అడ్డంకులను తొలగిస్తుంది. అలాగే, ఈ మొక్క వద్ద గురువారం నాడు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది.
2.తులసి మొక్క
తులసి మొక్కను ఇంట్లో పెంచితే చాలా మంచి జరుగుతుంది. తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది, అడ్డంకులు కూడా తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. ప్రతి రోజూ తులసి మొక్క దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అశీసులు ఉంటాయి.
3.బంతి మొక్క
బంతి మొక్క శాంతి, ప్రశాంతతను అందిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే వివాహ జీవితంలో అడ్డంకులు కూడా తొలగి పోతాయి. సానుకూల శక్తి ఏర్పడుతుంది, మనశ్శాంతి కూడా ఉంటుంది. ఇంటి ఉత్తరం వైపు బంతి మొక్కను నాటితే మంచిది. ఈ మొక్క ప్రేమ జీవితంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిస్తుంది.
4.ఆర్చిడ్
{{/usCountry}}బంతి మొక్క శాంతి, ప్రశాంతతను అందిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే వివాహ జీవితంలో అడ్డంకులు కూడా తొలగి పోతాయి. సానుకూల శక్తి ఏర్పడుతుంది, మనశ్శాంతి కూడా ఉంటుంది. ఇంటి ఉత్తరం వైపు బంతి మొక్కను నాటితే మంచిది. ఈ మొక్క ప్రేమ జీవితంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిస్తుంది.
4.ఆర్చిడ్
{{/usCountry}}ప్రేమ, అందం, కొత్త ప్రారంభాలకు చిహ్నం. ఈ మొక్క ఇంట్లో ఉంటే ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవు; వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో నైరుతి వైపు పెడితే మంచిది. పడకగదిలో పెంచుకోవాలనుకుంటే, వాయువ్యం వైపు ఉంచండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.