Vastu Shastra: రెండు భారీ భవనాల మధ్య మీ ఇల్లా? 'ఎనర్జీ బ్లాకేజ్'తో ఆర్థిక నష్టాలు తప్పవు.. వెంటనే ఇలా చేయండి!
Vastu Shastra: పక్కపక్కనే ఉండే భారీ భవనాల వల్ల ఇంటికి గాలి, వెలుతురు సరిగ్గా అందకపోవడాన్ని వాస్తు శాస్త్రం 'ఎనర్జీ బ్లాకేజ్'గా పరిగణిస్తుంది. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి కెరీర్, ఆదాయం మరియు కుటుంబ సంబంధాలపై చెడు ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు వీటిని పాటించండి.
నగరాల్లో స్థలం కొరత కారణంగా పక్కపక్కనే ఇళ్లు, భారీ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. అయితే, రెండు ఎత్తైన భవనాల మధ్య మీ ఇల్లు నలిగిపోతోందా? కనీసం గాలి, వెలుతురు కూడా సరిగ్గా రావడం లేదా? అయితే మీరు అప్రమత్తం కావాల్సిందే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి నిర్మాణాల వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహం ఆగిపోతుంది. దీనినే జ్యోతిష్య పరిభాషలో 'ఎనర్జీ బ్లాకేజ్' అని పిలుస్తారు. దీని ప్రభావం కేవలం వెలుతురు లేకపోవడమే కాదు, మీ కెరీర్, ఆదాయం మరియు బంధాలపై కూడా తీవ్రంగా పడుతుంది.

ఎనర్జీ బ్లాకేజ్ అంటే ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రకృతి నుంచి వచ్చే సూర్యరశ్మి, గాలి అనేవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే కాదు, అవి ఇంటికి జీవశక్తిని (Prana Energy) అందిస్తాయి. ఎప్పుడైతే మీ ఇంటిని చుట్టుపక్కల భవనాలు కమ్మేస్తాయో, అప్పుడు ఆ శక్తి ప్రవాహం ఆగిపోయి ఇంటి లోపల ప్రతికూలత పెరుగుతుంది.
దీని వల్ల కలిగే ప్రధాన నష్టాలు:
పనుల్లో ఆటంకాలు: ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, ప్రమోషన్లు ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఆర్థిక ఇబ్బందులు: అనవసర ఖర్చులు పెరగడం, వ్యాపారంలో నష్టాలు రావడం వంటివి 'ఎనర్జీ బ్లాకేజ్' సంకేతాలు.
మానసిక ప్రశాంతత కరువు: వెలుతురు సరిగ్గా లేని ఇళ్లలో ఉండే వారికి తరచూ ఆందోళన, చిరాకు, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బంధాల్లో చీలికలు: చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం, మనస్పర్థలు రావడం వంటివి సంభవిస్తాయి.
వాస్తు దోషాన్ని పోగొట్టుకోవడానికి సులభమైన మార్గాలు
ఇల్లు కట్టేసిన తర్వాత నిర్మాణాన్ని మార్చడం సాధ్యం కాదు. కాబట్టి, కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
1. ప్రధాన ద్వారం వద్ద పసుపు లైట్లు:
సూర్యరశ్మి తక్కువగా ఉండే ఇళ్లలో మెయిన్ డోర్ పైన పసుపు రంగు బల్బును అమర్చండి. ఇది కృత్రిమంగానైనా సూర్య కిరణాల ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఇంటి ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి.
2. విండ్ చైమ్స్ ఏర్పాటు:
ఇంటి లోపల గాలి తక్కువగా ఆడుతున్నప్పుడు విండ్ చైమ్స్ అలంకరించుకోండి. వాటి నుంచి వచ్చే చిన్నపాటి శబ్దం నిశ్శబ్దంగా ఉన్న ప్రతికూల శక్తిని కదిలించి, సానుకూలతను పెంచుతుంది.
3. మూగజీవాలకు ఆహారం:
మీ ఇంటి బాల్కనీలో లేదా కిటికీ బయట పక్షుల కోసం గింజలు, నీరు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల ప్రకంపనలు రావడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుంది.
ఇంటి అలంకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాస్తు దోష నివారణకు ఇంటి అలంకరణ కూడా ఒక అద్భుతమైన మార్గం. మీ ఇల్లు కాంతివంతంగా కనిపించడానికి ఈ చిట్కాలు పాటించండి:
లేత రంగులే ముఖ్యం: గోడలకు ముదురు రంగులు కాకుండా వైట్, ఆఫ్ వైట్, లేత పసుపు వంటి రంగులు వేయండి. ఇవి గదిలో ఉన్న కాంతిని ప్రతిబింబించి ఇల్లు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి.
వినాయకుడి విగ్రహం: ప్రధాన ద్వారం లోపలి వైపు లేదా బయటి వైపు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించండి. ఇది విఘ్నాలను తొలగించి శుభ ఫలితాలను ఇస్తుంది.
మొక్కల పెంపకం: ఇంట్లో తులసి, శమీ, మనీ ప్లాంట్ వంటి మొక్కలను పెంచండి. ఇవి గాలిని శుద్ధి చేయడమే కాకుండా వాస్తు దోషాలను హరిస్తాయి. ముఖ్యంగా ఈశాన్య మూలలో తులసి కోట ఉంటే ఎంతో శ్రేయస్కరం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


