చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలామంది ఇంట్లో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిని నిర్మించేటప్పుడు కచ్చితంగా వాస్తు చూసుకోవాలి.

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే, మెట్లు ఏ దిశలో ఉండాలి అనేది కూడా వాస్తు ప్రకారం చూసుకోవడం మంచిది. అలాగే, చాలా మంది మెట్ల కింద అనవసరమైన వస్తువులు, డస్ట్ బిన్లు, పనికిరాని సామాన్లు ఇలాంటివి పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మెట్ల కింద ఇలాంటివి పెట్టొచ్చా? దీని వలన ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్ల కింద పొరపాటున కూడా వీటిని పెట్టకండి
మెట్ల కింద కొన్ని పెట్టడం వలన ప్రతికూల శక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా మెట్లను నిర్మించేటప్పుడు ఉత్తరం లేదా పడమర వైపు ఉండేటట్టు చూసుకోవాలి. దక్షిణ దిశలో మెట్లు ఉండడం మంచిది కాదు. అలాగే, ప్లేస్ తక్కువ ఉందనే చాలామంది మెట్ల కింద అనవసరమైన వస్తువులను, పనికిరాని సామాన్లను పెడుతూ ఉంటారు. కొంతమంది పూజ గదిలో, వంటగదిలో, బాత్రూంలో కూడా అనవసరమైన వస్తువులను పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఏ తప్పులు చేయకూడదు.
ముఖ్యంగా, మెట్ల కింద కొన్నిటిని పెట్టడం వలన శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. పనికిరాని సామాన్లు, చెత్తాచెదారం వంటివి మెట్ల కింద పెట్టడం మానుకోవాలి.
డస్ట్ బిన్లు పెట్టకూడదు
డస్ట్ బిన్లు, చెత్త సామాన్లు, పాతవి, ఉపయోగించని వస్తువులు పెట్టడం మంచిది కాదు. చాలామంది మెట్ల కింద ఉండే ప్రదేశాన్ని ఇలా వాడుకుంటూ ఉంటారు. కానీ, అది పెద్ద తప్పు. వీటిని పెట్టడం మానుకోవాలి. లేకపోతే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మెట్లు చీకటిగా ఉండకూడదు
{{/usCountry}}డస్ట్ బిన్లు, చెత్త సామాన్లు, పాతవి, ఉపయోగించని వస్తువులు పెట్టడం మంచిది కాదు. చాలామంది మెట్ల కింద ఉండే ప్రదేశాన్ని ఇలా వాడుకుంటూ ఉంటారు. కానీ, అది పెద్ద తప్పు. వీటిని పెట్టడం మానుకోవాలి. లేకపోతే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మెట్లు చీకటిగా ఉండకూడదు
{{/usCountry}}మెట్లు ప్రదేశంలో చీకటిగా ఉండకూడదు. సాయంత్రం సంధ్య వేళలో లైట్లు వేయడం మంచిది. అలాగే, మెట్లను కూడా ఎప్పటికప్పుడు తుడుచుకుని శుభ్రంగా ఉంచుకోవాలి.
మెట్ల కింద నీళ్లు
మెట్ల కింద నీళ్లు నిలువ ఉండే పోవడం మంచిది కాదు. మెట్ల కింద కుళాయిలు వంటివి ఉంటే, అవి లీక్ అవ్వకుండా చూసుకోండి. వాటి నుంచి నీరు కారిపోవడం వలన కూడా సమస్యలు వస్తాయి. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఏ కుళాయి నుంచి కూడా అలా నీళ్లు వృథాగా పోవడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు అలాంటి వాటిని రిపేర్ చేయించుకోవడం మంచిది. లేదంటే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధ పడాల్సి ఉంటుంది.