వాస్తు ప్రకారం మెట్ల కింద ఈ వస్తువులు పెట్టకండి.. ఆర్థిక ఇబ్బందులు తప్పవట!
వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి, ప్రశాంత వాతావరణం ఉండేందుకు కొన్ని నియమాలను పాటించాలని చెబుతారు. ముఖ్యంగా మెట్ల నిర్మాణం, మెట్ల కింద ఉండే ప్రదేశం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కథనం వివరిస్తోంది.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలామంది ఇంట్లో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిని నిర్మించేటప్పుడు కచ్చితంగా వాస్తు చూసుకోవాలి.

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే, మెట్లు ఏ దిశలో ఉండాలి అనేది కూడా వాస్తు ప్రకారం చూసుకోవడం మంచిది. అలాగే, చాలా మంది మెట్ల కింద అనవసరమైన వస్తువులు, డస్ట్ బిన్లు, పనికిరాని సామాన్లు ఇలాంటివి పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మెట్ల కింద ఇలాంటివి పెట్టొచ్చా? దీని వలన ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్ల కింద పొరపాటున కూడా వీటిని పెట్టకండి
మెట్ల కింద కొన్ని పెట్టడం వలన ప్రతికూల శక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా మెట్లను నిర్మించేటప్పుడు ఉత్తరం లేదా పడమర వైపు ఉండేటట్టు చూసుకోవాలి. దక్షిణ దిశలో మెట్లు ఉండడం మంచిది కాదు. అలాగే, ప్లేస్ తక్కువ ఉందనే చాలామంది మెట్ల కింద అనవసరమైన వస్తువులను, పనికిరాని సామాన్లను పెడుతూ ఉంటారు. కొంతమంది పూజ గదిలో, వంటగదిలో, బాత్రూంలో కూడా అనవసరమైన వస్తువులను పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఏ తప్పులు చేయకూడదు.
ముఖ్యంగా, మెట్ల కింద కొన్నిటిని పెట్టడం వలన శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. పనికిరాని సామాన్లు, చెత్తాచెదారం వంటివి మెట్ల కింద పెట్టడం మానుకోవాలి.
డస్ట్ బిన్లు పెట్టకూడదు
డస్ట్ బిన్లు, చెత్త సామాన్లు, పాతవి, ఉపయోగించని వస్తువులు పెట్టడం మంచిది కాదు. చాలామంది మెట్ల కింద ఉండే ప్రదేశాన్ని ఇలా వాడుకుంటూ ఉంటారు. కానీ, అది పెద్ద తప్పు. వీటిని పెట్టడం మానుకోవాలి. లేకపోతే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మెట్లు చీకటిగా ఉండకూడదు
మెట్లు ప్రదేశంలో చీకటిగా ఉండకూడదు. సాయంత్రం సంధ్య వేళలో లైట్లు వేయడం మంచిది. అలాగే, మెట్లను కూడా ఎప్పటికప్పుడు తుడుచుకుని శుభ్రంగా ఉంచుకోవాలి.
మెట్ల కింద నీళ్లు
మెట్ల కింద నీళ్లు నిలువ ఉండే పోవడం మంచిది కాదు. మెట్ల కింద కుళాయిలు వంటివి ఉంటే, అవి లీక్ అవ్వకుండా చూసుకోండి. వాటి నుంచి నీరు కారిపోవడం వలన కూడా సమస్యలు వస్తాయి. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఏ కుళాయి నుంచి కూడా అలా నీళ్లు వృథాగా పోవడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు అలాంటి వాటిని రిపేర్ చేయించుకోవడం మంచిది. లేదంటే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధ పడాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


