Birds Vastu Shastra: చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా విధాలుగా లాభాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగి, ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి కూడా వీలవుతుంది. అందుకే చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. ఇంట్లో వస్తువులను కూడా వాస్తు ప్రకారం పెడుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు మన ఇంట్లోకి పక్షులు వస్తూ ఉంటాయి.

ఇంటికి పక్షులు వస్తే మంచిదా కాదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. కొన్ని పక్షులు శుభ ఫలితాలను తీసుకువస్తాయి, కొన్ని పక్షులు అశుభ ఫలితాలను తీసుకువస్తాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. మరి వాస్తు ప్రకారం ఎలాంటి పక్షులు ఇంట్లోకి వస్తే మంచిది? ఏ పక్షులు ఇంట్లోకి వస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పక్షులు ఇంటికి వస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.. సానుకూల శక్తి ప్రవహిస్తుంది
1.పిచ్చుకలు
పిచ్చుకలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా కనబడుతున్నాయి. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచి జరుగుతుంది. పిచ్చుకలు ఇంటికి రావడం శుభ సంకేతం. పిచ్చుక గూడు ఇంట్లో కడితే కూడా చాలా మంచి జరుగుతుంది. సంతోషం, శాంతి ఉంటాయి. ఇంటికి వచ్చి పిచ్చుక తన రెక్కలను విప్పినట్లయితే ప్రేమ, ఆప్యాయత కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఇంటికి పిచ్చుకలు వస్తే ధాన్యం, నీళ్లు వంటివి వాటికి ఇవ్వండి.
2.పావురాలు
ఇంటికి పావురం వస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. పావురం మీ ఇంటికి వస్తే ప్రశాంతత, డబ్బు కలుగుతాయి. అయితే పావురం ఇంటికి వస్తే వాటిని ఇంట్లోనే పూర్తిగా ఉంచేయకండి. ప్రతిరోజు ఇంట్లో పావురం ఉంటే ఆ శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ పావురం ఇంటికి వచ్చి మళ్లీ వెళ్లిపోతే మాత్రం ఇబ్బందులు ఉండవు. సానుకూల శక్తి కలుగుతుంది.
3.చిలుకలు
ఇంటికి చిలుక వస్తే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. చిలుక ఇంటికి వస్తే కుటుంబ సభ్యుల తెలివితేటలు పెరుగుతాయి. కొంతమంది చిలుకలను పెంచుతూ ఉంటారు. చిలుకలను ఇంటిలో ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచవచ్చు. దీంతో కుటుంబాలు అభివృద్ధి కూడా ఉంటుంది. ఈ పక్షులు ఇంట్లోకి రావడం మంచిది కాదు.
ఈ పక్షులు ఇంటికి వస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి
1.గుడ్లగూబ
{{/usCountry}}ఇంటికి చిలుక వస్తే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. చిలుక ఇంటికి వస్తే కుటుంబ సభ్యుల తెలివితేటలు పెరుగుతాయి. కొంతమంది చిలుకలను పెంచుతూ ఉంటారు. చిలుకలను ఇంటిలో ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచవచ్చు. దీంతో కుటుంబాలు అభివృద్ధి కూడా ఉంటుంది. ఈ పక్షులు ఇంట్లోకి రావడం మంచిది కాదు.
ఈ పక్షులు ఇంటికి వస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి
1.గుడ్లగూబ
{{/usCountry}}ఇంటికి గుడ్లగూబ వస్తే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీపావళి నాడు మాత్రం ఈ పక్షి ఇంటికి వస్తే ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. కానీ మిగిలిన రోజుల్లో ఈ పక్షి ఇంటికి వస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య భయం పెరుగుతుంది.
2.గబ్బిలాలు
ఇంట్లోకి గబ్బిలం రావడం కూడా మంచిది కాదు. ఇది కూడా ప్రతికూల ప్రభావాన్ని తీసుకొస్తుంది. అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. గబ్బిలాలు ఇంటికి వస్తే ప్రతికూల శక్తి, అనారోగ్య సమస్యలు వంటివి కలిగే అవకాశం ఉంది. కొన్ని కొన్ని సార్లు గబ్బిలాలు ఇంటికి వస్తే ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది.