...
...
Next Story

Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలను దక్షిణ దిశలో పెట్టకండి.. చాలా నష్టాలు కలుగుతాయి, అప్పులు పెరుగుతాయి!

కొన్ని మొక్కలను ఉంచడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ మొక్కలు దక్షిణం వైపు ఉంటే నష్టాలు కలుగుతాయి, సమస్యలు ఎక్కువవుతాయి. మరి మీ ఇంట్లో కూడా ఈ తప్పు చేస్తున్నారేమో చూసుకోండి. పొరపాటున కూడా దక్షిణ దిశలో ఈ మొక్కలు ఉండకూడదు. ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. శుభ ఫలితాలు ఎదురవుతాయి.

Published on: Nov 24, 2025, 12:00:04 IST
Advertisement

ఇంట్లో మొక్కల్ని పెంచేటప్పుడు దక్షిణ దిశలో కొన్ని మొక్కలను ఉంచడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ మొక్కలు దక్షిణం వైపు ఉంటే నష్టాలు కలుగుతాయి, సమస్యలు ఎక్కువవుతాయి. మరి మీ ఇంట్లో కూడా ఈ తప్పు చేస్తున్నారేమో చూసుకోండి. పొరపాటున కూడా దక్షిణ దిశలో ఈ మొక్కలు ఉండకూడదు. సమస్యలు, అప్పులు ఎక్కువ అవుతాయి. ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. శుభ ఫలితాలు ఎదురవుతాయి.

ఇంట్లో ఈ మొక్కలను దక్షిణ దిశలో పెట్టకండి.. నష్టాలు రావచ్చు

1.తులసి మొక్క

ఇంట్లో ఈ మొక్కలను దక్షిణ దిశలో పెట్టకండి.. నష్టాలు రావచ్చు (pinterest)
ఇంట్లో ఈ మొక్కలను దక్షిణ దిశలో పెట్టకండి.. నష్టాలు రావచ్చు (pinterest)

తులసి మొక్కను ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుతారు. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు, ప్రతిరోజు తులసి మొక్క ముందు పూజలు చేస్తారు. తులసి మొక్కని ఇంట్లో తూర్పు వైపు పెట్టాలి. తూర్పు వైపు తులసి మొక్క ఉండడం వలన అభివృద్ధి ఉంటుంది. అదే దక్షిణ దిశలో ఉన్నట్లయితే సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాస్తు దోషాలు కలుగుతాయి. పేదరికం, ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి తులసి మొక్కని దక్షిణం వైపు పెట్టకండి.

2.అరటి మొక్క

అరటి మొక్కను విష్ణువుగా భావిస్తారు. అరటి చెట్టుని దక్షిణ దిశలో పెంచడం మంచిది కాదు. ఈ దిశలో అరటి మొక్క ఉంటే నష్టాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలిగి సానుకూల శక్తి ఎక్కువవుతుంది. ఉత్తరం లేదా తూర్పు వైపు అరటి చెట్టుని ఉంచడం మంచిది.

3.జమ్మి మొక్క

జమ్మి మొక్కను ఇంట్లో ఉంచితే చాలా మంచి జరుగుతుంది. శని, శివునితో ఈ మొక్కకు సంబంధం ఉంటుంది. ఈ మొక్కను దక్షిణం వైపు అస్సలు పెంచకూడదు. తూర్పు వైపు ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. సరైన దిశలో ఈ మొక్కను ఇంట్లో పెంచితే డబ్బు, సంతోషం, స్థిరత్వం ఉంటాయి.

4.మనీ ప్లాంట్

ఈ మొక్క సానుకూల శక్తిని తీసుకొస్తుంది. మానసిక ప్రశాంతతనూ అందిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ మొక్కను ఇంటి దక్షిణ దిశలో మాత్రం పెంచకండి. ఇది సమస్యలు కలిగించే అవకాశం ఉంది. ఈ మొక్కను తూర్పు వైపు పెడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks