బెడ్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా? అయితే దంపతుల మధ్య గొడవలు గ్యారెంటీ.. వెంటనే మార్చుకోండి!
వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరుగుతున్నాయా? భాగస్వామితో మనస్పర్థలు వస్తున్నాయా? అయితే దానికి కారణం మీ బెడ్‌రూమ్‌లో ఉన్న వాస్తు దోషాలే కావచ్చు. గదిలో సానుకూల శక్తిని పెంచి, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని బలపరిచేందుకు తొలగించాల్సిన ఆ 4 వస్తువుల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.
ఈ వస్తువులు బెడ్‌రూమ్‌లో ఉంటే వెంటనే తొలగించండి: ప్రతి ఒక్కరు కూడా పెళ్లి తర్వాత సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అనుకుంటారు, కానీ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. మీ వివాహ జీవితంలో కూడా ఏదో ఒక సమస్య వస్తుందా? అయితే వాస్తు ప్రకారం ఈ చిన్న మార్పులు చేయండి. రోజు భాగస్వామితో గొడవలు జరుగుతున్నట్లయితే, ఇంట్లో 4 అశుభప్రదమైన వస్తువులను బెడ్‌రూమ్ నుంచి తొలగించడం మంచిదే.

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. సానుకూల శక్తి కారణంగా టెన్షన్లు వంటివి తొలిగిపోతాయి. భార్యాభర్తలు సంతోషంగా ఉండొచ్చు. మరి ఎలాంటి వస్తువులు బెడ్‌రూమ్‌లో ఉండకూడదు? బయట వలన భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం.
ఈ వస్తువులు బెడ్‌రూమ్‌లో ఉంటే వెంటనే తొలగించండి, లేదంటే భార్యభర్తల మధ్య సమస్యలు వస్తూనే ఉంటాయి
1.ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్:
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు వంటి వాటికి ఎక్కువ అలవాటు పడిపోయారు. ఇవి బెడ్‌రూమ్‌లో ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇవి ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. వీటిని బెడ్‌రూమ్ నుంచి తొలగించడం వలన భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
2.అద్దం:
వాస్తు ప్రకారం అద్దం సరిగ్గా ఉండకపోతే అనేక సమస్యలు వస్తాయి. నిద్రపోయేటప్పుడు మీ నీడ అద్దంలో కనపడకూడదు. అలా జరిగితే గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అద్దాన్ని మంచానికి ఎదురుగా ఉంటే తొలగించండి, లేకపోతే దానిని క్లాత్‌తో కప్పండి.
3.మురికి పాత్రలు:
వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో తినేసిన కంచాలు వంటివి ఉండకూడదు. ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలి. రాత్రిపూట అలా వాటిని బెడ్‌రూమ్‌లో ఉంచితే ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని వెంటనే తొలగించడం మంచిది.
4.దేవుడి విగ్రహాలు:
బెడ్‌రూమ్‌లో దేవుడి విగ్రహాలు వంటివి ఉంచకండి. ఇవి ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో ఇలాంటివి ఉండడం వలన ఇబ్బందులు పెరిగిపోతాయి, టెన్షన్ ఎక్కువవుతుంది. కాబట్టి వీటిని కూడా బెడ్‌రూమ్ నుంచి తొలగించండి. ఒకవేళ మీరు దేవుడి ఫోటోలు ఉంచాలంటే రాధాకృష్ణుల ఫోటోని ఉంచుకోవచ్చు. మిగిలిన దేవుడి విగ్రహాలు, యుద్ధానికి సంబంధించినవి వంటివి ఉంటే ప్రతికూల శక్తి ఏర్పడి, సానుకూల శక్తి తొలగిపోతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


