...
...
Next Story

Vastu tips for gifts: పొరపాటున కూడా ఈ తొమ్మిది వస్తువులను ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు.. చాలా సమస్యలు వస్తాయి!

Vastu tips for gifts: మనం ప్రేమతో ఇచ్చే బహుమతులు ఒక్కోసారి మనకు తెలియకుండానే అరిష్టాన్ని తెచ్చిపెడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఇచ్చే వారికి, తీసుకునే వారికి కూడా నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: May 8, 2026, 09:10:48 IST
Advertisement

ప్రేమను షేర్ చేసుకోవడానికి, ఒకరి పట్ల కృతజ్ఞత చెప్పుకోవడానికి బహుమతులకి మించి ఏమీ వుండదు. ఏదైనా పెళ్లిళ్లు గృహప్రవేశం, పుట్టినరోజు ఇలాంటివి జరిగినప్పుడు మనకి నచ్చినవి, వారికి ఉపయోగపడేవి కొని ఇస్తూ ఉంటాం. వాస్తు ప్రకారం అన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. కొన్ని వస్తుందని బహుమతిగా ఇస్తే ఆర్థిక నష్టం, ఆత్మీయుల మధ్య గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.

Vastu tips for gifts: పొరపాటున కూడా ఈ తొమ్మిది వస్తువులను ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు (pinterest)
Vastu tips for gifts: పొరపాటున కూడా ఈ తొమ్మిది వస్తువులను ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు (pinterest)

చాలా మందికి దీనిపై అవగాహన లేదు. ఇలాంటి వాటిని బహుమతులుగా ఇస్తే ఎన్నో నష్టాలు సంభవిస్తాయి. మరి ఆ అశుభ ఫలితాలను ఇచ్చే వస్తువులు ఏవి? వాటి వెనక ఉన్న కారణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మరి బహుమతులు ఇచ్చేటప్పుడు ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదు ?

పొరపాటున కూడా వీటిని బహుమతులుగా ఇవ్వకండి

1.పదునైన వస్తువులు:

ఎవరికైనా బహుమతులు ఇచ్చేటప్పుడు పదునైన కత్తెరలు, కత్తులు వంటివి ఇవ్వకూడదు. ఇవి అశుభ ఫలితాలను తీసుకువస్తాయి. పైగా రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది. ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి.

2.నల్లటి వస్తువులు:

ఎవరికైనా బహుమతులను ఇచ్చేటప్పుడు నల్లటి వస్తువులను ఇవ్వకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం నల్లటి వస్తువులను ఇవ్వకుండా ఉండడమే మంచిది. దాని వలన ప్రతికూలత పెరిగిపోతుంది.

3.ఆర్టిఫిషియల్ పువ్వులు:

ఎవరికైనా పువ్వులు ఇచ్చేటప్పుడు తాజా పువ్వులను ఇవ్వండి. ఆర్టిఫిషియల్ పువ్వులను మాత్రం ఇవ్వకండి. వీటి వలన కూడా లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

4.తోలుతో చేసిన వస్తువులు:

నీటికి సంబంధించిన అక్వేరియంలు, ఫౌంటెన్లు వంటివి ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. కాబట్టి ఈ తప్పు కూడా చేయకుండా చూసుకోండి.

6.గడియారాలు:

ఎవరికీ కూడా గడియారాలు వంటివి బహుమతులుగా ఇవ్వకూడదు. అది కూడా నష్టాన్ని తీసుకొస్తుంది.

7.జేబు రుమాలు:

జేబు రుమాలను ఇతరులకు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇది రిలేషన్‌షిప్‌లో సమస్యలను, అపార్థాలను పెంచుతుంది.

8.పచ్చళ్ళు:

ఎవరికి పచ్చళ్ళు ఉచితంగా ఇవ్వడం మంచిది కాదు. అది వారి బంధాన్ని చేదుగా మారుస్తుంది. కాబట్టి వీటిని కూడా ఎవరికి బహుమతిగా లేదా ఉచితంగా ఇవ్వద్దు.

9.ముళ్ళ మొక్కలు:

ఎవరికైనా మొక్కలను బహుమతిగా ఇచ్చేటప్పుడు ముళ్ళ మొక్కలను ఇవ్వకుండా చూసుకోండి. ఇవి ప్రతికూల శక్తిని కలిగించి, సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe