...
...
Next Story

Window Vastu Tips : ఇంటికి ఏ దిశలో కిటికీలు ఉంటే శుభం.. ఎన్ని ఉంటే మంచిది?

Vastu Tips : వాస్తు శాస్త్ర సూత్రాలను అనుసరించి ఇంట్లో కిటికీలను నిర్మిస్తే.. ఆ ఇల్లు ఎల్లప్పుడూ సానుకూల శక్తిని, ఆరోగ్యాన్ని, సంపదను ఇస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని కిటికీలు ఉండాలి?

Published on: May 12, 2026, 14:35:04 IST
Advertisement

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కట్టుకోవాలనేది కల. ఇల్లు కట్టేటప్పుడు మనం కేవలం దాని డిజైన్ లేదా అందానికే కాకుండా వాస్తు శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఎల్లప్పుడూ సంతోషం, శాంతి, ప్రశాంతత, ఆర్థిక శ్రేయస్సును తెస్తుందని నమ్మకం. మనం ఇంటి ప్రధాన ద్వారం, దైవ మందిరం, వంటగది వాస్తుపై దృష్టి పెడతాం. కానీ కిటికీల వాస్తును నిర్లక్ష్యం చేస్తాం.

ఏ దిశలో కిటికీలు ఉండాలి?

కిటికీల వాస్తు చిట్కాలు
కిటికీల వాస్తు చిట్కాలు

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి కిటికీలు కేవలం గాలి, వెలుతురు లోపలికి వచ్చే మార్గాలు మాత్రమే కాదు. విశ్వంలోని సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారాలు. కిటికీలు సరైన దిశలో ఉంటే, ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అవి తప్పుడు దిశలో ఉంటే, పేదరికం రాజ్యమేలుతుంది.

  • వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి తూర్పు దిశలో కిటికీలు ఏర్పాటు చేయడం శుభప్రదం. సూర్యుడు తూర్పు నుండే ఉదయిస్తాడు. సూర్యకాంతి నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. సూర్యకిరణాలు ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేసి, ఆరోగ్యాన్ని, విజయాన్ని అందిస్తాయి.
  • ఉత్తర దిక్కును కుబేరుడి నివాసంగా భావిస్తారు. ఈ దిశలో పెద్ద కిటికీలను నిర్మించడం వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం పెరిగి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
  • ఈశాన్య దిశ దైవ నిలయం. ఈ దిశలో కిటికీలు ఉంటే, ఇల్లు ఆధ్యాత్మిక ఆలోచనలు, శాంతి, శ్రేయస్సుతో నిండి ఉంటుంది.

ఏ దిశలో ఉండకూడదు?

దక్షిణం, నైరుతి దిశలలో కిటికీలు పెట్టడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి. దక్షిణ దిశను యమధర్మరాజు దిశ అని అంటారు. ఈ దిశలో కిటికీలు ఉంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దక్షిణ దిశలో కిటికీలు ఉంటే, వాటిని వీలైనంత వరకు మూసి ఉంచడం లేదా చిన్నవిగా ఉంచడం మంచిది.

ఎన్ని కిటికీలు ఉండాలి?

ఇంటికి తూర్పు, ఉత్తర దిశలలో ఉన్న కిటికీలు, దక్షిణ, పడమర దిశలలో ఉన్న కిటికీల కంటే పెద్దవిగా ఉండాలి. కిటికీలు తెరిచేటప్పుడు లేదా మూసేటప్పుడు కర్ణకఠోరమైన శబ్దం రాకూడదు. శబ్దం చేసే కిటికీల వల్ల ఇంట్లో వాస్తు దోషాలు, కలహాలు, అశాంతి కలుగుతాయి.

కిటికీ అద్దం పగిలిపోయినా లేదా పగుళ్లు వచ్చినా, దానిని వెంటనే మార్చాలి. పగిలిన అద్దం ఇంట్లోకి పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. కిటికీలు ఎల్లప్పుడూ లోపలికి తెరుచుకోవాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. కిటికీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe