ఈ మధ్యకాలంలో చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు. ఆఫీసులో పనిచేసే వారికి టేబుల్స్, సరైన సౌకర్యాలు ఉంటాయి. ఇంట్లో పని చేసేవారు మాత్రం మంచం మీద కూడా పని చేస్తూ ఉంటారు. ఇంట్లో వర్క్ చేసేవారు మంచం పై కూర్చుని వర్క్ చేయొచ్చా? వాస్తు, జ్యోతిష్యం ప్రకారం అలా చేయడం మంచిదా, కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిలో చాలా మంది మంచం పైన కూర్చుని పని చేస్తూ ఉంటారు. వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ అలవాటు దీర్ఘకాలంలో అనేక ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ఇక మరి దీని వలన కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాహువు, కేతువుల ప్రభావం
రాహువు, కేతువుల ప్రభావంతో కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కోవచ్చని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మంచం పై రాహువు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకనే మంచం పైన కూర్చుని పని చేయకూడదు. అలా చేయడం వలన బద్ధకం, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి.
కొన్ని సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, ఇలా మంచం పై కూర్చుని పని చేయడం వలన సహోద్యోగులు, ఉన్నతాధికారులతో అపార్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయట. ఫలితంగా ఉద్యోగంలో ఎదుగుదల తగ్గిపోతుంది. కొత్త అవకాశాలు కూడా రావని చెబుతారు.
ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం
వాస్తు ప్రకారం మంచం పై కూర్చుని పని చేయడం, భోజనం చేయడం మంచిది కాదు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇవన్నీ సంప్రదాయ వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన విషయాలు.
విశ్రాంతి, కర్మ శక్తుల మధ్య అసమతుల్యత
జ్యోతిష్యం ప్రకారం చూస్తే, మంచం శుక్రుడు, చంద్రుడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. విశ్రాంతి, సుఖం, మానసిక ప్రశాంతతకు ఈ రెండు గ్రహాలు ప్రతీకలు. పని చేసే ప్రదేశం బుధుడు, శనితో అనుసంధానమై ఉంటుంది. జ్ఞానం, క్రమశిక్షణ, కర్మకు ఇవి ప్రతీకలు.
{{/usCountry}}జ్యోతిష్యం ప్రకారం చూస్తే, మంచం శుక్రుడు, చంద్రుడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. విశ్రాంతి, సుఖం, మానసిక ప్రశాంతతకు ఈ రెండు గ్రహాలు ప్రతీకలు. పని చేసే ప్రదేశం బుధుడు, శనితో అనుసంధానమై ఉంటుంది. జ్ఞానం, క్రమశిక్షణ, కర్మకు ఇవి ప్రతీకలు.
{{/usCountry}}అందుకనే మంచం పై కూర్చుని ఆఫీస్ పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల విశ్రాంతి, కర్మ శక్తుల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఏకాగ్రత తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.