...
...
Next Story

వట పౌర్ణిమ 2026: మర్రి చెట్టును ఎందుకు పూజిస్తారు? సావిత్రి–సత్యవంతుల గాథ వెనుక అసలు రహస్యం

జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పౌర్ణిమనాడు ఆచరించే వట పౌర్ణిమ వ్రతం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతంగా భావిస్తారు. భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, అఖండ సౌభాగ్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. మర్రి వృక్షానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తెలుసుకోండి.

Published on: Jun 29, 2026, 12:30:38 IST
Advertisement

వట పౌర్ణిమ 2026: జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు పెళ్లయిన మహిళలు భక్తిశ్రద్ధలతో వట పౌర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. భర్త ఆయురారోగ్యాల కోసం, సుఖమైన దాంపత్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను, పురాణ గాథలను ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిమూర్తుల నిలయం మర్రి వృక్షం

వట పౌర్ణిమ 2026: మర్రి చెట్టును ఎందుకు పూజిస్తారు? సావిత్రి–సత్యవంతుల గాథ వెనుక అసలు రహస్యం (pinterest)
వట పౌర్ణిమ 2026: మర్రి చెట్టును ఎందుకు పూజిస్తారు? సావిత్రి–సత్యవంతుల గాథ వెనుక అసలు రహస్యం (pinterest)

సనాతన ధర్మంలో వృక్షాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో మర్రి చెట్టుకు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా దీనిని భావిస్తారు. ఈ వృక్షం దైవికమైన శక్తిని కలిగి ఉంటుందని నమ్మకం. ఈ చెట్టు వేళ్లల్లో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని విశ్వాసం. అందుకనే ఒకసారి మర్రి వృక్షాన్ని ఆరాధించడం త్రిమూర్తులను ఆరాధించినంత పుణ్యఫలాన్ని ఇస్తుందని భావిస్తారు. మహిళలు వట పౌర్ణిమ నాడు మర్రి చెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

సావిత్రి–సత్యవంతుల గాథ

పురాణాల ప్రకారం, యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలను తీసుకువెళ్తుంటే, సావిత్రి తన పాతివ్రత్యంతో, భక్తితో, పట్టుదలతో యమధర్మరాజును అడ్డుకుంటుంది. సావిత్రి భక్తికి, జ్ఞానానికి మెచ్చిన యముడు ఆమెకు వరమిచ్చి సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ప్రసాదిస్తాడు. సత్యవంతుడు స్పృహలోకి వచ్చేసరికి అతడు మర్రి చెట్టు కిందనే ఉంటాడు.

ఆ అద్భుత ఘట్టానికి మర్రి చెట్టే సాక్షిగా నిలిచింది. అందుకే అప్పటి నుంచి పెళ్లయిన మహిళలు భర్త దీర్ఘాయుష్షు, అఖండ సౌభాగ్యం కోసం మర్రి చెట్టును పూజించడం ఆచారంగా మారింది. ఆ రోజు మహిళలు సంప్రదాయబద్ధంగా అలంకరణ చేసుకుని, మర్రి చెట్టు చుట్టూ పవిత్ర దారాన్ని చుట్టుతూ ప్రదక్షిణలు చేసి భక్తిని చాటుకుంటారు.

పూజా విశేషాలు – ఫలితాలు

మహిళలు రోజంతా ఉపవాసం ఉండి, సోడశ అలంకరణలు ధరించి, మర్రి చెట్టు వద్దకు వెళ్లి పూజలు, ప్రదక్షిణలు నిర్వహించాలి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe