గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. కొన్నిసార్లు శుభ యోగాలు కలిగితే, కొన్ని సార్లు అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలాన్ని బట్టి గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి.
శుక్ర సంచారం

శుక్రుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు రాశి మార్పు చెందినప్పుడు, నక్షత్ర మార్పు జరిగినప్పుడు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అనేక రాశుల వారు శుక్రుని రాశి మార్పు కారణంగా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. శుక్రుడు సంతోషం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. జాతకంలో శుక్రుడు స్థానం బాగా ఉంటే సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. డబ్బుకు కూడా లోటు ఉండదు.
ప్రస్తుతం శుక్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. ఈరోజు నుంచి శుక్రుడు తన వేగాన్ని మార్చబోతున్నాడు. డిసెంబర్ 9 అంటే ఈరోజు సాయంత్రం 5:30 నుంచి జ్యేష్ఠ నక్షత్రంలో శుక్రుడు ప్రయాణం చేస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. శుక్రుడు డిసెంబర్ 20వ తేదీ ఉదయం దాకా ఇదే నక్షత్రంలో సంచారం చేస్తాడు. దీంతో విపరీతమైన లాభాలు కలుగుతాయి. జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? శుక్రుని అనుగ్రహంతో ఏ రాశి వారు సంతోషంగా ఉంటారో ఇప్పుడే తెలుసుకుందాం.
డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది?
1.మిధున రాశి
మిధున రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. మిధున రాశి వారు ఆనందంగా ఉంటారు. బుధ నక్షత్రంలో శుక్రుని పయనం ఈ రాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని ఈ సమయంలో ఊపందుకుంటుంది. సంపద, ఆస్తులు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకి కూడా ఇది అద్భుతమైన సమయం.
2.కన్యా రాశి
{{/usCountry}}మిధున రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. మిధున రాశి వారు ఆనందంగా ఉంటారు. బుధ నక్షత్రంలో శుక్రుని పయనం ఈ రాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని ఈ సమయంలో ఊపందుకుంటుంది. సంపద, ఆస్తులు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకి కూడా ఇది అద్భుతమైన సమయం.
2.కన్యా రాశి
{{/usCountry}}కన్యా రాశి వారికి కూడా ఇది ఉత్తమ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. న్యాయపరమైన విషయాల్లో విజయాన్ని అందుకుంటారు. వ్యాపారం చేసే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. పాత పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు కలుగుతాయి. పని కోసం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.
3.మీన రాశి
మీన రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఆనందంగా ఉంటారు. శుక్రుని దయతో సమాజంలో పేరు, ప్రతిష్టలను పొందుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఈ రాశి వారు ఈ సమయంలో ఆనందంగా వుంటారు.