...
...
Next Story

Venus Transit 2026: ఈరోజు శుక్ర నక్షత్ర సంచారంలో మార్పు, నాలుగు రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బు, విజయాలు ఇలా ఎన్నో

శుక్రుడు కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు ఈరోజు సంచారంలో మార్పు చేయబోతున్నాడు. జనవరి 2, అనగా ఈరోజు, శుక్రుడు మధ్యాహ్నం 1:39కి పూర్వాషాడ నక్షత్రం రెండవ పాదంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇలా శుక్రుడు తన నక్షత్రంలో మార్పు చేయడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

Published on: Jan 2, 2026, 13:30:54 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మార్చడం సహజం. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాలుగా మార్పులను తీసుకొస్తుంది. సంపద, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడు కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు ఈరోజు సంచారంలో మార్పు చేయబోతున్నాడు.

శుక్ర నక్షత్ర సంచారం

శుక్ర నక్షత్ర సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు
శుక్ర నక్షత్ర సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

జనవరి 2, అనగా ఈరోజు, శుక్రుడు మధ్యాహ్నం 1:39కి పూర్వాషాడ నక్షత్రం రెండవ పాదంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇలా శుక్రుడు తన నక్షత్రంలో మార్పు చేయడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారు అనేక లాభాలను పొందబోతున్నారు. ఆదాయం పెరగడంతో పాటు ప్రేమ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.

మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా ఈరోజు వెతుక్కుంటూ వస్తాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? శుక్రుని అనుగ్రహంతో ఎవరికీ అసలు లాభాలు కలగబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్ర నక్షత్ర సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుడు నక్షత్ర సంచారం బాగా మంచి ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. సమస్యలు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కూడా ఈరోజు వెతుక్కుంటూ వస్తాయి.

2.కన్యా రాశి

తులా రాశి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. రాయడం మీద ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. పెద్ద సమస్యలన్నీ తొలగిపోతాయి.

4.మకర రాశి

మకర రాశి వారికి శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడి అనుగ్రహంతో అదృష్టం పెరుగుతుంది. బాధలు తొలగిపోతాయి. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. వైవాహిక జీవితంలో కూడా చక్కటి మార్పులను చూస్తారు. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks