15 రోజుల్లో ఈ రాశులకు గోల్డెన్ డేస్.. శుక్ర అనుగ్రహంతో ఈ రాశుల వారు కుబేరులు అవ్వడం ఖాయం!

జూన్ 11న శుక్రుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. శని పాలించే ఈ నక్షత్రంలోకి శుక్రుడి రాక వల్ల వృషభం, మిథునం సహా నాలుగు రాశుల వారికి ధన యోగం పట్టనుంది. 15 రోజుల్లో ఈ రాశులకు గోల్డెన్ డేస్..  పూర్తి వివరాలు మీకోసం. 

Published on: May 26, 2026, 15:43:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఐశ్వర్యానికి, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై బలంగా ఉంటుంది. తాజాగా జూన్ 11, 2026న శుక్రుడు పుష్యమి నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. పుష్యమి నక్షత్రం నక్షత్రాలన్నింటిలోనూ అత్యంత శుభప్రదమైంది. దీనికి అధిపతి శని దేవుడు.

15 రోజుల్లో ఈ రాశులకు గోల్డెన్ డేస్.. శుక్ర అనుగ్రహంతో ఈ రాశుల వారు కుబేరులు అవ్వడం ఖాయం!
15 రోజుల్లో ఈ రాశులకు గోల్డెన్ డేస్.. శుక్ర అనుగ్రహంతో ఈ రాశుల వారు కుబేరులు అవ్వడం ఖాయం!

సంపదను ఇచ్చే శుక్రుడు, కర్మఫల ప్రదాత అయిన శని పాలించే నక్షత్రంలోకి రావడం వల్ల దేశవ్యాప్తంగా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ సమయంలో వీరికి అర్థికంగా, వృత్తిపరంగా ఎదురుండదని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.

సూర్య నక్షత్ర మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సానుకూల ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు.

మీ మాట తీరు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడటమే కాకుండా, పొదుపు చేయడానికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కెరీర్‌లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇక పెళ్లికాని వారికి ప్రేమ చిగురించే అవకాశం ఉంది. దంపతులు ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా గడుపుతారు.

2.మిథున రాశి

మిథున రాశి వారికి అదృష్టం తలుపు తట్టే రోజులు మొదలయ్యాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. కొందరికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కలగవచ్చు. ఊహించని విధంగా ధన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి.

3.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాల పెంపుతో పాటు పదోన్నతి లభించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీరు కలగన్న ఒక పెద్ద కోరిక ఈ కాలంలో నెరవేరవచ్చు.

4.మకర రాశి

మకర రాశి వారికి, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అకస్మాత్తుగా ధనం వచ్చే అవకాశం ఉండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ప్రభావితం చేస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలను తెచ్చిపెట్టే డీల్స్ కుదురుతాయి. ఆర్ధికంగా ఎటువంటి లోటు లేకుండా సాగిపోతారు.

గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు గ్రహాల సంచారం, నక్షత్ర స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహ బలాలను బట్టి ఈ ఫలితాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. సరైన నిర్ణయాల కోసం నిపుణులను సంప్రదించగలరు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More