గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులు తీసుకువస్తుంది. శుక్రుడు డబ్బు, ఆనందం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.

ఇది మీన రాశిలో ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? మాలవ్య రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం... మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు
శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే శని కూడా సంచారం చేస్తుండడంతో ఈ రెండు గ్రహాల సంయోగంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక లాభాలను కలిగిస్తుంది. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు చూద్దాం.
మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి ఊహించని లాభాలు
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రాశి 11వ ఇంట్లో మాలవ్య రాజయోగం ఏర్పడడంతో అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.
2.మిధున రాశి
మిధున రాశి వారికి 10వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో బాగా లాభాలను పొందుతారు. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కొత్త ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు.
3.కర్కాటక రాశి
{{/usCountry}}మిధున రాశి వారికి 10వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో బాగా లాభాలను పొందుతారు. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కొత్త ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు.
3.కర్కాటక రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం అనేక లాభాలను కలిగిస్తుంది. ఈ రాశి 9వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారి అదృష్టాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
4.కన్య రాశి
కన్య రాశి వారికి ఈ రాజయోగం బాగా లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ ఉంటుంది. పని ప్రదేశంలో ఆనందంగా ఉంటారు. ఒంటరిగా ఉన్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
5.మీన రాశి
మీన రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.