మాలవ్య రాజయోగం: శుక్రుడి సంచారంతో ఐదు రాశులకు ఊహించని లాభాలు.. ఆస్తులు, ఇళ్ళు, వాహనాలతో పాటు ఎన్నో!

శుక్రుడు డబ్బు, ఆనందం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది మీన రాశిలో ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. 

Published on: Feb 19, 2026 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులు తీసుకువస్తుంది. శుక్రుడు డబ్బు, ఆనందం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.

మాలవ్య రాజయోగం: శుక్రుడి సంచారంతో ఐదు రాశులకు ఊహించని లాభాలు (pinterest)
మాలవ్య రాజయోగం: శుక్రుడి సంచారంతో ఐదు రాశులకు ఊహించని లాభాలు (pinterest)

ఇది మీన రాశిలో ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? మాలవ్య రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం... మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు

శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే శని కూడా సంచారం చేస్తుండడంతో ఈ రెండు గ్రహాల సంయోగంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక లాభాలను కలిగిస్తుంది. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు చూద్దాం.

మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి ఊహించని లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రాశి 11వ ఇంట్లో మాలవ్య రాజయోగం ఏర్పడడంతో అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.

2.మిధున రాశి

మిధున రాశి వారికి 10వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో బాగా లాభాలను పొందుతారు. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కొత్త ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు.

3.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం అనేక లాభాలను కలిగిస్తుంది. ఈ రాశి 9వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారి అదృష్టాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

4.కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రాజయోగం బాగా లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ ఉంటుంది. పని ప్రదేశంలో ఆనందంగా ఉంటారు. ఒంటరిగా ఉన్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

5.మీన రాశి

మీన రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More