...
...
Next Story

Venus: శుక్రుడి రోహిణి సంచారం: ఏప్రిల్ 27 నుంచి ఈ రాశుల దశ తిరగనుంది.. వీరికి రాజభోగాలు ఖాయం!

రోహిణి నక్షత్రంలోకి శుక్రుడు: విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 27న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ గ్రహ గమనం వల్ల మేష, వృషభ, కర్కాటక రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా, ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Published on: Apr 24, 2026, 15:30:14 IST
Advertisement

ప్రేమ, ఐశ్వర్యం, సౌందర్యం మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడు ప్రస్తుతం సొంత రాశి అయినటువంటి వృషభంలో సంచారం చేస్తున్నాడు. ఒక గ్రహం తన సొంత రాశిలో ఉన్నప్పుడు దాని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు నక్షత్రం మార్పు చేయబోతున్నాడు. మరో మూడు రోజుల్లో, అంటే ఏప్రిల్ 27న శుక్రవారం, రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

Venus: శుక్రుడి రోహిణి సంచారం: ఏప్రిల్ 27 నుంచి ఈ రాశుల దశ తిరగనుంది
Venus: శుక్రుడి రోహిణి సంచారం: ఏప్రిల్ 27 నుంచి ఈ రాశుల దశ తిరగనుంది

ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనసుకు కారకుడు. అయితే శుక్రుడు భౌతిక సుఖాలకు కారకుడు. ఈ రెండు గ్రహాల ప్రభావం వలన ఆకర్షణ, సృజనాత్మకత, సంపద కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, కళాకారుల లైఫ్ మారిపోతుంది. స్వర్ణ అవకాశమని చెప్పొచ్చు. శుక్రుడి నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయి? ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

రోహిణి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి లాభాలు:

1.మేష రాశి:

మేష రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి వృత్తి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. సానుకూల ఫలితాలను చూస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి కలుగుతుంది.

జీతాలు పెంపు ఉండొచ్చు. కార్యాలయంలో మీ పనితీరును గుర్తించే సీనియర్లు మీకు మంచి బాధ్యతల్ని అప్పగిస్తారు. తోటి ఉద్యోగస్తులకు పూర్తి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు కూడా ఇదే శుభ సమయం. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. నెట్‌వర్క్ పెరుగుతుంది. కొత్త డీల్స్‌ను కుదుర్చుకుంటారు.

2.వృషభ రాశి:

కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రాశి వారికి ప్రశాంతత కూడా లభిస్తుంది. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఇతరులను కూడా సులువుగా మీ మాటలతో ప్రభావితం చేయగలరు.

3.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు వస్తాయి.

బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. విజయాలను కూడా అందుకుంటారు. ఈ రాశి విద్యార్థులు చదువులో ఏకాగ్రతను పెంపొందించుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks