జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సుఖసంతోషాలు, ధనం, వైభవం, విలాసాలకుకారకుడిగా భావిస్తారు. అలాగే రాహువును భ్రమ లేదా ఆకస్మిక పరిణామాలకు కారకుడిగా చెబుతారు. తులా రాశికి అధిపతి అయిన శుక్రుడు, అదే రాశిలో ఉన్న రాహువు నక్షత్రమైన 'స్వాతి నక్షత్రం'లోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి సవాళ్లను తెచ్చిపెడుతోంది. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
స్వాతి నక్షత్రంలో శుక్రుడు.. ఈ రాశులకు సమస్యలు ఉండచ్చు
1. మేష రాశి

మేష రాశి వారికి శుక్రుడి ఈ నక్షత్ర మార్పు వైవాహిక జీవితంలో తీవ్ర ఒత్తిడిని తీసుకురావచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న విషయాలకే వివాదాలు, అపార్ధాలు రావచ్చు. బంధాల్లో నమ్మకం సడలి, ఊహించని భ్రమలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యాపార రంగంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి, దీనివల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది.
2. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ కాలం మిశ్రమ ఫలిలాలను ఇస్తుంది. ధనలాభం ఉన్నప్పటికీ, అదే స్థాయిలో ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ ఖర్చుల కారణంగా ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దిగజారే ప్రమాదం ఉంది. ఆరోగ్యం మందగించవచ్చు. బంధువుల నుంచి లేదా ఆత్మీయుల నుంచి ఎలాంటి చెడు వార్తినైనా వినాల్సి రావచ్చు. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి.
3. సింహ రాశి
సింహ రాశి వారికి శుక్రుడి సంచారం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబడి సాధారణంగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు సతతం చేస్తాయి. వ్యాపారం చేసేవారు పార్టనర్‌షిప్‌లో సమస్యలను ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో మనస్పర్థలు రాకుండా వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
4. వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేకుండానే అనవసర ప్రయాణాలు, పరుగులాటలు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను తలకిందులు చేస్తాయి. రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య వేధించవచ్చు. మానసిక ప్రశాంతత కరువై సతమతమవుతారు. కాబట్టి ఆదాయానికి, ఖర్చులకు మధ్య సరైన సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.
5. ధనుస్సు రాశి
{{/usCountry}}ఈ రాశి వారికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేకుండానే అనవసర ప్రయాణాలు, పరుగులాటలు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను తలకిందులు చేస్తాయి. రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య వేధించవచ్చు. మానసిక ప్రశాంతత కరువై సతమతమవుతారు. కాబట్టి ఆదాయానికి, ఖర్చులకు మధ్య సరైన సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.
5. ధనుస్సు రాశి
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి ఈ గోచార కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ధనం సంపాదించడంలో కొన్ని కష్టాలు ఎదురైనా, ఎట్టకేలకు డబ్బు చేతికి అందుతుంది. భౌతిక సుఖ సంతృప్తిలో లోపం ఏర్పడవచ్చు. ఎంత కష్టపడినా తగిన ఫలితం దక్కకపోవడంతో మనసు అశాంతిగా ఉంటుంది. అయితే, నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. వ్యాపారపరమైన పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది.
6. మీన రాశి
మీన రాశి వారికి రాహు నక్షత్రంలో శుక్రుడి సంచారం ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ కాలంలో కెరీర్, ఆర్థిక అంశాలు, ఆరోగ్యం మరియు కుటుంబ విషయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ఓపికతో, శాంతియుతంగా పరిష్కరించుకోవడం మీ భవిష్యత్తుకు మంచిది.