విదుర నీతి: ఈ 5 రకాల వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. లేదంటే జీవితమే నాశనం!

విదురుడు చెప్పిన విదుర నీతి నేటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. మన జీవితంపై చెడు ప్రభావం చూపే వెన్నుపోటు పొడిచే మోసగాళ్లు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు, స్వార్థపరులు, గౌరవం ఇవ్వని వ్యక్తులు, కోపాన్ని అదుపులో ఉంచుకోలేనివారి వంటి ఐదు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని విదురుడు సూచించాడు.   

Published on: Aug 1, 2026, 14:08:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహాభారతంలో అత్యంత మేధావిగా, ధర్మమూర్తిగా మహాజ్ఞాని విదురుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందించిన 'విదుర నీతి' కేవలం ఆ కాలానికే పరిమితం కాలేదు, నేటి డిజిటల్ యుగంలోనూ మనిషి జీవన విధానాన్ని మార్చగల శక్తి దానికి ఉంది. మనిషి జీవితంలో విజయం సాధించాలన్నా, సుఖశాంతులతో జీవించాలన్నా మంచి స్నేహ సంబంధాలు చాలా అవసరం. అయితే, కొందరి సావాసం జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన 5 రకాల వ్యక్తుల గురించి విదురుడు ఎప్పుడో హెచ్చరించాడు. వారిని జీవితంలో దరిచేరనీయకపోవడమే మంచిదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యక్తులు ఎవరంటే...

విదుర నీతి: ఈ 5 రకాల వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. లేదంటే జీవితమే నాశనం!
విదుర నీతి: ఈ 5 రకాల వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. లేదంటే జీవితమే నాశనం!

వెన్నుపోటు పొడిచే మోసగాళ్లు

ఎదుటేమో అతిగా పొగడటం, వెనుక మాత్రం మన గురించే చెడుగా మాట్లాడటం కొందరి నైజం. ఇలాంటి వ్యక్తులతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని విదుర నీతి చెబుతోంది. "ఎదుట ఒకలా, వెనుక మరోలా మాట్లాడేవారిని నమ్మితే జీవితంలో కోలుకోలేని దెబ్బతింటాం," అని విదురుడు హెచ్చరించారు. సమాజంలో మన పరువు తీయడానికి వీరు ఏ క్షణమైనా వెనుకాడరు. అందుకే ముఖం మీద నిక్కచ్చిగా మాట్లాడేవారే నిజమైన మిత్రులని గ్రహించాలి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు

ఏ చిన్న విషయానికైనా ఆలోచించకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉన్నవారికి దూరంగా ఉండాలి. తొందరపాటు ఎప్పుడూ నష్టాన్నే మిగులుస్తుంది. విదుర నీతి ప్రకారం, ప్రశాంతత, సహనం లేని వ్యక్తి కేవలం తన సర్వనాశనం కోరుకోవడమే కాకుండా, తనతో పాటు ప్రయాణించేవారిని కూడా కష్టాల్లోకి నెడతాడు. కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంయమనంతో వ్యవహరించే వివేకవంతుల సావాసాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

ఇతరులకు కీడు తలపెట్టే స్వార్థపరులు

ఎల్లప్పుడూ పక్కవారికి ఎలా నష్టం చేకూర్చాలా అని ఆలోచించే దుర్మార్గుల సావాసం పాముతో సమానం. కష్టకాలంలో వీరు ఏనాడూ తోడుగా నిలవరు సమస్యలను తెచ్చిపెడతారు. జీవితంలో ఎలాంటి వారినైనా స్నేహితులుగా చేసుకునే ముందు వారి స్వభావాన్ని పూర్తిగా పరిశీలించాలని విదురుడు సూచించారు. స్వార్థపరులైన మనుషుల మాటలను నమ్మి మోసపోవద్దు.

గౌరవం ఇవ్వని వ్యక్తులు

సమాజంలో ఎదుటివారికి ఏ మాత్రం విలువ ఇవ్వని, చిన్నచూపు చూసేవారిని నమ్ముకుంటే మన ఆత్మవిశ్వాసమే దెబ్బతింటుంది. "ఎక్కడ గౌరవం లభించదో, అక్కడ క్షణం కూడా నిలబడకూడదు," అనేది పెద్దల మాట. స్వార్థం కోసం ఎదుటివారిని అవమానించే స్వభావం ఉన్నవారు అవసరమైనప్పుడు ద్రోహం చేయడానికి వెనుకాడరు. కాబట్టి మనల్ని గౌరవించే బంధాలకే విలువ ఇవ్వాలి.

కోపాన్ని అదుపులో ఉంచుకోలేని క్రోధితులు

చిన్నచిన్న విషయాలకే విపరీతంగా కోప్పడేవారు, తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోలేనివారు ఎప్పుడూ చుట్టూ అశాంతిని నింపుతారు. కోపంలో వీరు ఏ తప్పు చేయడానికి అయినా వెనుకాడరు. అలాంటి వారి ప్రభావం వారి పక్కన ఉండేవాళ్లపై తీవ్రంగా పడుతుంది. ప్రశాంత మనస్తత్వం ఉన్నవారి సావాసం మనసుకు నెమ్మదినిస్తుంది. కోపాన్ని శాసించలేని మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మహాత్ముడైన విదురుడు చెప్పిన ఈ హెచ్చరికలను పాటిస్తే జీవితంలో అనవసరమైన మానసిక వేదనలు, పెద్ద ప్రమాదాల నుంచి సులభంగా బయటపడవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More