...
...
Next Story

విజయదశమి 2026: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు? శమీ పూజ విశిష్టత ఇదే!

విజయదశమి హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటి. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన రోజు, దుర్గాదేవి మహిషాసురుడిపై విజయం సాధించిన రోజుగా ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

Published on: Oct 19, 2026, 15:00:03 IST
Advertisement

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో విజయదశమి కూడా ఒకటి. హిందువులు భక్తిశ్రద్ధలతో దసరా పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా విజయదశమిని జరుపుకుంటారు. రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా ఈ విజయదశమికి ప్రాధాన్యత ఉంది. అయితే, విజయదశమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు ఆరోజు ఏం చేయాలి వంటి వివరాలను కూడా తెలుసుకుందాం.

విజయ దశమి తేదీ, సమయం

విజయదశమి 2026: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు? శమీ పూజ విశిష్టత ఇదే! (AI)
విజయదశమి 2026: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు? శమీ పూజ విశిష్టత ఇదే! (AI)

దశమి తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:50 నుంచి దశమి తిథి అక్టోబర్ 21 మధ్యాహ్నం 2:11 వరకు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే, అక్టోబర్ 20న విజయదశమిని జరుపుకోవాలని నిర్ణయించారు. మైసూర్‌లో కూడా అక్టోబర్ 21న విజయదశమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

విజయదశమి నాడు పూజలు, శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. విజయదశమి నాడు అపరాజిత దేవిని పూజిస్తారు. శమీ వృక్షానికి కూడా పూజలు చేస్తారు. అపరాజిత దేవిని పూజించడం వలన విజయం కలుగుతుందని, శుభఫలితాలను పొందవచ్చని నమ్మకం.

శమీ వృక్షాన్ని ఆరాధిస్తే శుభం, సౌభాగ్యం కలుగుతాయి. అలాగే, ఆ రోజు ఆయుధ పూజ చేయడం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. పనిముట్లు, వాహనాలు, యంత్రాలకు పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే, చాలామంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాన్ని కూడా నిర్వహిస్తారు.

విజయదశమి రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు?

దసరా పండుగలో నీలరంగులో అద్భుతంగా కనిపించే పాలపిట్టతో సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత దశమి నాడు పాలపిట్టను చూస్తారు. దీనిని అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు.

దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకం. అలాగే, రాముడు రావణాసురుడిని సంహరించి యుద్ధంలో గెలిచాడు. అమ్మవారు మహిషాసురుడిని సంహరించింది. ఇంతటి మంచి రోజున పాలపిట్ట కనిపిస్తే విజయం వరించినట్లేనని నమ్ముతారు. అదృష్టంగా భావిస్తారు.

శమీ పూజ

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks