దసరా పండుగతో ఈ 5 రాశులకు మహర్దశ.. దుర్గాదేవి అనుగ్రహంతో అదృష్టం రెట్టింపు!

దసరా నవరాత్రులు, విజయదశమి సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో ఐదు రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.  గ్రహస్థితుల ప్రభావంతో ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల మార్పులు కలగవచ్చని విశ్వసిస్తున్నారు. 

Published on: Oct 16, 2026, 16:00:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దసరా నవరాత్రులు ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం నాడు విజయదశమి పండుగను జరుపుకోవాలి. దసరా పండుగ వస్తుండటంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది. దుర్గాదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది. మరి, విజయదశమికి ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

దసరా పండుగతో ఈ 5 రాశులకు మహర్దశ.. దుర్గాదేవి అనుగ్రహంతో అదృష్టం రెట్టింపు! (AI)
దసరా పండుగతో ఈ 5 రాశులకు మహర్దశ.. దుర్గాదేవి అనుగ్రహంతో అదృష్టం రెట్టింపు! (AI)

దసరా పండుగ కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. సూర్యుడు నీచ రాశి అయిన తులా రాశిలో సంచారం చేస్తాడు.

బుధుడు అక్టోబర్ 24 నుంచి వక్ర స్థితిలో ఉంటాడు. రాహువు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శని మీన రాశిలో ఉంటాడు. ఇలా కీలక గ్రహాల మార్పు కారణంగా దసరా సమయంలో కొన్ని రాశుల వారి జీవితం అద్భుతంగా మారుతుంది. మరి, ఆ రాశులు ఏవంటే ఇప్పుడే చూసేద్దాం.

దసరా పండుగకు ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు, ఊహించని విధంగా కీలక మార్పులు కలగనున్నాయి

వృషభ రాశి

వృషభ రాశి వారికి దసరా బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారికి దుర్గాదేవి ఆశీస్సులు ప్రత్యేకంగా ఉండటంతో అదృష్టం కూడా పెరుగుతుంది. ఎలాంటి పనులు చేసినా విజయవంతంగా సాగుతాయి. ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే, ఎంత ఖర్చు చేసినా కూడా ఆదాయం వస్తుంది. సంపద పెరగడంతో ఇబ్బందులు ఉండవు. ఆర్థిక అభివృద్ధి కారణంగా ఈ రాశి వారు మెరుగైన ఫలితాలను చూస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా బాగా కలిసి వస్తుంది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ దసరా పండుగ విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయమని చెప్పొచ్చు. వ్యాపారస్తులు ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అద్భుతమైన లాభాలను చూస్తారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ రాశి వారు మంచి ఫలితాలను చూస్తారు. ఎలాంటి పనులు చేపట్టినా కూడా అవి విజయవంతంగా సాగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కుంభ రాశి వారు దసరా సమయంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

తులా రాశి

తులా రాశి వారికి కూడా ఇది శుభసమయమని చెప్పొచ్చు. దసరా మంచి ఫలితాలను అందిస్తుంది. నిరుద్యోగులకు శుభసమయం. మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు కూడా లభిస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More