దసరా నవరాత్రుల్లో శ్రీసూక్తం, అష్టలక్ష్మీ స్తోత్రం ఎందుకు చదవాలి?
నవరాత్రుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీసూక్తం పఠించడం హిందూ సంప్రదాయంలో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అష్టలక్ష్మీ స్తోత్రం లక్ష్మీదేవి ఎనిమిది రూపాలైన ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిలను స్తుతిస్తుంది.
నవరాత్రుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అదే విధంగా, వివిధ స్తోత్రాలను, శ్లోకాలను కూడా చదువుతూ ఉంటారు. దసరా నవరాత్రుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీసూక్తం పఠించడం మంచిది.

హిందూ సంప్రదాయాల్లో వీటిని ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. అష్టలక్ష్మీ స్తోత్రం లక్ష్మీదేవి ఎనిమిది రూపాలను స్తుతిస్తుంది. అలాగే, శ్రీసూక్తం వేదాల్లో ప్రసిద్ధి చెందిన సూక్తం. ఇది మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తుంది.
అష్టలక్ష్మి ఎనిమిది రూపాలను ఈ స్తోత్రంలో చూడొచ్చు
అష్టలక్ష్మి ఎనిమిది రూపాలు కూడా సంపద, ధైర్యం, సంతానం, విద్య, విజయం వంటివి జీవితంలో వివిధ శుభసంపదలకు ప్రతీకలు. ఇవి అష్టలక్ష్ములు.
ఆదిలక్ష్మి: శాంతి, దైవానుగ్రహం కోసం ఆదిలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
ధాన్యలక్ష్మి: ఆహార సమృద్ధి, కుటుంబ పోషణ కోసం ధాన్యలక్ష్మిని భక్తితో భక్తులు ఆరాధించడం జరుగుతుంది.
ధైర్యలక్ష్మి: ధైర్యం, కష్టాలు ఎదుర్కొనే శక్తి కలగాలని భక్తులు ధైర్యలక్ష్మిని పూజిస్తారు.
గజలక్ష్మి: గౌరవం, ఐశ్వర్యం కలగాలని, ఎప్పుడూ శ్రేయస్సు ఉండాలని గజలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
సంతానలక్ష్మి: కుటుంబంలో పిల్లలు, సంతానం కలిగి సంతోషంగా ఉండాలని, పిల్లలు ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తారు.
విజయలక్ష్మి: చేపట్టే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వాలని, ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ప్రార్థిస్తారు.
విద్యాలక్ష్మి: జ్ఞానం, వివేకం, విద్య కోసం విద్యాలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
ధనలక్ష్మి: ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని, సంపద, ఆర్థిక శ్రేయస్సు కలగాలని ధనలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది.
ఎనిమిది లక్ష్మీదేవులున్న అష్టలక్ష్మీ స్తోత్రాన్ని ఇంట్లో చదవడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ లక్ష్ముల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
శ్రీసూక్తాన్ని ఎందుకు చదవాలి?
దసరా నవరాత్రుల్లో వీలైతే శ్రీసూక్తాన్ని కూడా చదువుకోండి. ఋగ్వేదానికి అనుబంధంగా పరంపరలో ప్రసిద్ధి చెందినది ఈ సూక్తం. శ్రీసూక్తం చదవడం వలన మంచి లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభం, ఐశ్వర్యం కలగాలని శ్రీసూక్తాన్ని చాలామంది చదువుతూ ఉంటారు.
శ్రీసూక్త పారాయణం చేస్తే ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ధన సమృద్ధి, జీవన స్థిరత్వం కోసం చాలామంది శ్రీసూక్తాన్ని చదివి అమ్మవారిని పూజిస్తారు. అలాగే, శ్రీసూక్తాన్ని చదవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. లయబద్ధమైన మంత్ర పారాయణం చేస్తే ఏకాగ్రత కూడా రెట్టింపు అవుతుంది. వేదమంత్రాల అర్థాన్ని తెలుసుకుంటూ పఠిస్తే ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


