...
...
Next Story

Wealthy Rasis: అదృష్టవంతులు అంటే వీరిదే.. ఈ 4 రాశుల వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు, సంతోషమే సంతోషం!

Wealthy Rasis: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి పుట్టుకతోనే రాజయోగాలు ఉంటాయి. గ్రహగతులు, దేవతా అనుగ్రహం వల్ల ఈ నాలుగు రాశుల వారు ఆర్థిక ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. లక్ష్మీ నారాయణుల కృపతో వీరి జీవితం విలాసవంతంగా సాగిపోతుంది. ఆ రాశుల వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Apr 28, 2026, 14:00:56 IST
Advertisement

మనకి మొత్తం 12 రాశులు. ఈ రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, రాశుల వారి పేరు, ప్రవర్తన గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. అయితే ఏ రాశుల వారు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంటారు? డబ్బు కొరత ఉండదు? ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు? మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులే ఉండవు, డబ్బు కొరత ఎప్పుడూ రాదు, ఆనందంగా ఉంటారు

1.వృషభ రాశి:

Wealthy Rasis: అదృష్టవంతులు అంటే వీరిదే.. ఈ 4 రాశుల వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు (pinterest)
Wealthy Rasis: అదృష్టవంతులు అంటే వీరిదే.. ఈ 4 రాశుల వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు (pinterest)

వృషభ రాశి వారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని అనుగ్రహంతో సంపద, విలాసాలు, డబ్బుకి లోటు ఉండదు. పైగా ఈ రాశి వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, విలాసవంతమైన జీవితాన్ని కూడా ఈ రాశి వారు గడుపుతారు. ఈ రాశి వారికి విష్ణువు ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో ఏ బాధలో ఉండరు, ఆనందం ఎప్పుడూ వారితోనే ఉంటుంది.

2.తులా రాశి:

తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ రాశి వారు బాగా తెలివైన వారు కూడా. ఎలాంటి సమస్య వచ్చినా సరే బాగా నిర్వహించగలరు. ఏ ఇబ్బంది లేకుండా బయటపడగలరు. అలాగే వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా ఎప్పుడూ భారీగా లాభాలను పొందుతారు.

3.సింహ రాశి:

సింహ రాశి వారు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. డబ్బుకి లోటు ఉండదు. ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయి. వారి బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. కష్టపడి మంచి ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. రెగ్యులర్‌గా శ్రీ సూక్తాన్ని చదివితే మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు.

4.కర్కాటక రాశి:

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks