ఆగస్టు 24–30 వార ఫలాలు: ఈ రాశులకు అదృష్టం.. ఆర్థికంగా బలపడే అవకాశం!
ఆగస్టు 24 నుంచి 30 వరకు గ్రహాల సంచారం కారణంగా జ్యోతిష్యపరంగా కీలకమైన వారం కానుంది. సింహ రాశిలో సూర్యుడు, బుధుడు, కన్యలో శుక్రుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో గురుడు, మీనంలో శని వక్ర స్థితిలో కొనసాగుతున్నారు.
ఆగస్టు 24 నుంచి ఆగస్టు 30 వరకు రాబోయే ఈ వారం జ్యోతిష్య పరంగా అత్యంత కీలకం కానుంది. సూర్యుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తుండగా, ఆగస్టు 22నే బుధుడు కూడా సింహ రాశిలోకి ప్రవేశించాడు. మరోవైపు కన్యారాశిలో శుక్రుడు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు.

ఇక కర్కాటక రాశిలో గురు సంచారం, మీన రాశిలో శని వక్ర స్థితిలో కొనసాగుతున్నాయి. ఈ వారం మధ్యలోనే శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, చంద్రగ్రహణం వంటి అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ఖగోళ మార్పుల ప్రభావం పన్నెండు రాశుల వారి ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితాలపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
మేష రాశి:
ఈ వారం ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది. ఎప్పట్నుంచో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగపడతాయి. అధికారుల మద్దతు లభిస్తుంది. అయితే ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
వృషభ రాశి:
ఈ రాశి వారికి వారం ప్రారంభంలో పనిభారం కాస్త ఎక్కువే ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది సరైన సమయం. పాత పరిచయాలు వ్యాపారంలో లాభాన్నిస్తాయి. అయితే ఖర్చులు మీ బడ్జెట్‌ను తారుమారు చేయవచ్చు.
మిథున రాశి:
ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారం విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి:
గురుడు మీ రాశిలోనే ఉండటంతో ఆర్థిక విషయాల్లో స్పష్టత వస్తుంది. నిలిచిపోయిన పాత బకాయిలు చేతికి అందుతాయి. అయితే అనవసర ఖర్చులపై నిఘా పెట్టడం చాలా అవసరం.
సింహ రాశి:
సింహ రాశిలో సూర్య-బుధుల కలయిక ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలను బయటకు తీసుకువస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు.
కన్యా రాశి:
ఈ రాశి వారు ఈ వారం ప్రతి విషయంలోనూ ఓపిక వహించాలి. చిన్నచిన్న విషయాలకే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సీనియర్ల సలహా తీసుకోవడం మేలు.
తులా రాశి:
ఈ రాశి వారికి వారం ద్వితీయార్ధంలో కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు తలపు తడతాయి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈ వారం కొద్దిగా శ్రమించాల్సి ఉంటుంది. మధ్యతరహా నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు మాటల వల్ల కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు.
ధనుస్సు రాశి:
ఈ రాశి వారికి ప్రయాణాలు, విద్య లేదా కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతాల పరిచయాలు వ్యాపారాన్ని లాభాల బాట పడుతుంది.
మకర రాశి:
ఈ రాశి వారు కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. సహోద్యోగుల సహాయంతో కఠినమైన బాధ్యతలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత అప్పులు తీర్చే మార్గాలు అన్వేషిస్తారు.
కుంభ రాశి:
ఈ రాశి వారికి వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలు కీలకంగా మారుతాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు అందుకుంటారు.
మీన రాశి:
ఈ రాశి వారు ఈ వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ముందుకు సాగాలి. వ్యాపారంలో ఆశించిన లాభాలు క్రమంగా కనిపిస్తాయి. ఆరోగ్య పరంగా నిద్రలేమి, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.
ఎవరికి ఎక్కువ లాభం?
ఈ వారంలో మిథున, కర్కాటక, సింహ రాశుల వారికి అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు ఎదురుకానున్నాయి. వీరు కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


