2025 Last Amavasya: అమావాస్య నాడు పితృ దేవతలను ఆరాధించే సంప్రదాయం ఉంది. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తారు. అలాగే తోచినది దానం చేయడం వంటివి కూడా అమావాస్య నాడు ఆచరిస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య నాడు చంద్రుడిని కూడా ఆరాధిస్తారు. చంద్రుడిని అమావాస్య నాడు పూజించడం వలన కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారు. అమావాస్య నాడు అష్టైశ్వర్యాలు, ధన ప్రాప్తి కలగడానికి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు.
డిసెంబర్ 2025 అమావాస్య

ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య (2025 last amavasya) రేపు అనగా డిసెంబర్ 19న వచ్చింది. అమావాస్య తిథి డిసెంబర్ 19 ఉదయం 4:19కి ప్రారంభమై, డిసెంబర్ 20 ఉదయం 7:13తో ముగుస్తుంది. ఈ లెక్కన డిసెంబర్ 19, శుక్రవారం నాడు అమావాస్యను పాటించాలి.
చివరి అమావాస్య ముహూర్త సమయాలు:
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:30 నుంచి ఉదయం 5:25 వరకు
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:32 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 1:09 నుంచి మధ్యాహ్నం 2:56 వరకు
గోధూళి ముహూర్తం: సాయంత్రం 5:09 నుంచి సాయంత్రం 5:35 వరకు
పూజా విధానం:
- అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శివుడిని, విష్ణువును ఆరాధించాలి.
- అలాగే ఈ రోజు పితృదేవతలను కూడా పూజించాలి.
- అమావాస్య నాడు ఉపవాసం (Amavasya Fasting) ఉండి, శివుడిని, చంద్రుడిని ప్రత్యేకించి ఆరాధించాలి.
- పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెడితే మంచిది.
- అమావాస్య నాడు దాన ధర్మాలు చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
ఇలా పితృదేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు
- పితృదేవతల పేర్లు చెప్పి తర్పణాలు వదలడం వంటివి చేస్తే పితృ దేవతల అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు.
- తర్పణాలు వదలడం, పిండ ప్రధానం వంటివి ఆచరిస్తే పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. వారి ఆశీర్వాదాలను పొందడానికి వీలవుతుంది. అలాగే ఈ రోజు పూజ చేయడం వలన చెడు కర్మల ప్రభావం కూడా తగ్గుతుంది. జీవితంలో ప్రశాంతత కూడా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}