ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య ఎప్పుడు? తేదీ, సమయంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలగడానికి ఏం చెయ్యాలో తెలుసుకోండి!

ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య రేపు అనగా డిసెంబర్ 19న వచ్చింది. అమావాస్య నాడు పితృ దేవతలను ఆరాధించే సంప్రదాయం ఉంది. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తారు. అలాగే తోచినది దానం చేయడం వంటివి కూడా అమావాస్య నాడు ఆచరిస్తారు. హిందూ సంప్రదాయంలో అమావాస్య నాడు చంద్రుడిని కూడా ఆరాధిస్తారు.

Published on: Dec 18, 2025, 13:30:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 Last Amavasya: అమావాస్య నాడు పితృ దేవతలను ఆరాధించే సంప్రదాయం ఉంది. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తారు. అలాగే తోచినది దానం చేయడం వంటివి కూడా అమావాస్య నాడు ఆచరిస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య నాడు చంద్రుడిని కూడా ఆరాధిస్తారు. చంద్రుడిని అమావాస్య నాడు పూజించడం వలన కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారు. అమావాస్య నాడు అష్టైశ్వర్యాలు, ధన ప్రాప్తి కలగడానికి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు.

ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య ఎప్పుడు? (pinterest)
ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య ఎప్పుడు? (pinterest)

డిసెంబర్ 2025 అమావాస్య

ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య (2025 last amavasya) రేపు అనగా డిసెంబర్ 19న వచ్చింది. అమావాస్య తిథి డిసెంబర్ 19 ఉదయం 4:19కి ప్రారంభమై, డిసెంబర్ 20 ఉదయం 7:13తో ముగుస్తుంది. ఈ లెక్కన డిసెంబర్ 19, శుక్రవారం నాడు అమావాస్యను పాటించాలి.

చివరి అమావాస్య ముహూర్త సమయాలు:

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:30 నుంచి ఉదయం 5:25 వరకు

విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:32 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు

అమృతకాలం: మధ్యాహ్నం 1:09 నుంచి మధ్యాహ్నం 2:56 వరకు

గోధూళి ముహూర్తం: సాయంత్రం 5:09 నుంచి సాయంత్రం 5:35 వరకు

పూజా విధానం:

  1. అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శివుడిని, విష్ణువును ఆరాధించాలి.
  2. అలాగే ఈ రోజు పితృదేవతలను కూడా పూజించాలి.
  3. అమావాస్య నాడు ఉపవాసం (Amavasya Fasting) ఉండి, శివుడిని, చంద్రుడిని ప్రత్యేకించి ఆరాధించాలి.
  4. పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెడితే మంచిది.
  5. అమావాస్య నాడు దాన ధర్మాలు చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

ఇలా పితృదేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు

  • పితృదేవతల పేర్లు చెప్పి తర్పణాలు వదలడం వంటివి చేస్తే పితృ దేవతల అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు.
  • తర్పణాలు వదలడం, పిండ ప్రధానం వంటివి ఆచరిస్తే పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. వారి ఆశీర్వాదాలను పొందడానికి వీలవుతుంది. అలాగే ఈ రోజు పూజ చేయడం వలన చెడు కర్మల ప్రభావం కూడా తగ్గుతుంది. జీవితంలో ప్రశాంతత కూడా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More