...
...
Next Story

Dhanu Sankranthi 2025: ధను సంక్రాంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయంతో పాటు పూజా విధానం తెలుసుకోండి

సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రారాజు అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తే ‘సంక్రాంతి’ అని పిలుస్తారు. దీనిని చాలా ఉత్తమమైన దినంగా భావిస్తారు. ప్రస్తుతం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 16, మంగళవారం వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు.

Published on: Nov 28, 2025, 10:40:16 IST
Advertisement

Dhanu Sankranthi 2025: సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రారాజు అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తే ‘సంక్రాంతి’ అని పిలుస్తారు. దీనిని చాలా ఉత్తమమైన దినంగా భావిస్తారు. ఆ రోజున సూర్యుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. సూర్యుడిని పూజించడం వలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

ధను సంక్రాంతి 2025 (pinterest)
ధను సంక్రాంతి 2025 (pinterest)

సూర్యుణ్ణి (Sun Lord) ఆరాధిస్తే పురోగతి కలుగుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు కూడా పూర్తవుతాయి. అడ్డంకులన్నీ తొలగి ఆనందంగా ఉండొచ్చు. ఇక ఇప్పుడు త్వరలో ధను సంక్రాంతి రాబోతోంది. ధను సంక్రాంతి (Dhanu Sankranthi) ఎప్పుడు వస్తుంది? తేదీ, సమయంతో పాటు సూర్యుడిని ఆ రోజు ఎలా ఆరాధించాలో కూడా తెలుసుకుందాం.

సూర్య సంచారం 2025

ప్రస్తుతం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 16, మంగళవారం ఉదయం 4:26కి సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధను సంక్రాంతి మొదలవుతుంది. జనవరి 13, 2026 వరకు ఇదే రాశిలో సూర్యుని సంచారం ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మకర సంక్రాంతిని మనం జరుపుకుంటాము.

ధను సంక్రాంతి శుభ ముహూర్తం

పంచాంగం ప్రకారం ధను సంక్రాంతి డిసెంబర్ 16న వస్తుంది. ఆ రోజు స్నానం, జపం, దానం వంటివి చేస్తే శుభఫలితాలు ఎదురవుతాయి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆరాధించడం వలన మంచి ఫలితాలు చూడొచ్చు.

మహా పుణ్యకాలం: ఉదయం 7:09 నుంచి 8:30 వరకు

సూర్యుడుని ధను సంక్రాంతి నాడు ఇలా ఆరాధిస్తే మంచిది

  1. ధను సంక్రాంతి నాడు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  2. కుదిరితే నది స్నానం చేయడం మంచిది. లేదంటే స్నానం చేసే నీళ్లలో గంగాజలాన్ని వేసుకోవాలి.
  3. ఉదయాన్నే సూర్యోదయం సమయంలో సూర్యుని ఆరాధించాలి.
  4. ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో పూలు వేసి సూర్యుడికి ఆ నీటిని సమర్పించాలి.
  5. ఈ నీటిని సూర్యుడికి సమర్పించేటప్పుడు ‘ఓం సూర్యాయ నమః’ మంత్రాన్ని పఠించాలి.
  6. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పూలను ఆ రోజున సమర్పిస్తే మంచిది. తర్వాత సూర్యుడికి హారతి ఇవ్వాలి.
  7. చివరిగా తప్పులను క్షమించమని, మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి. ఇలా సూర్యుడిని ఆ రోజు ఆరాధించడం వలన మీ సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks