...
...
Next Story

Dasara Diyas : దసరా రాత్రి ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దీపం వెగిలించండి.. విజయం మీతోనే!

Dasara Diyas : దసరా పండుగ నవరాత్రుల ముగింపును, దీపావళి రాకను సూచిస్తుంది. ఈ రోజున దీపాలు వెలిగించడం వల్ల దుష్టశక్తులు, జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. 2026 దసరా పండుగ రాత్రి ఇంట్లో ఏ ప్రదేశంలో దీపాలు వెలిగించాలి?

Published on: Oct 15, 2026, 14:58:31 IST
Advertisement

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి, హిందూ మతంలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు. దసరా పండుగను ప్రతి సంవత్సరం అశ్విని మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున జరుపుకొంటారు. ఇది అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. అంతేకాకుండా దుర్గాదేవి కూడా ఈ రోజున మహిషాసురుడిని సంహరించింది. ఈ పండుగ విజయాన్ని జరుపుకోవడమే కాకుండా దీపావళికి ముందు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక సువర్ణావకాశంగా కూడా విజయదశమిని చూస్తారు. మత విశ్వాసం ప్రకారం, దసరా పండుగ రోజున సాయంత్రం లేదా రాత్రిపూట ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి. ఇది ఆర్థిక సమస్యలను తొలగించి, ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది.

దసరా రోజు దీపాలు వెలిగించాల్సిన ప్రదేశాలు
దసరా రోజు దీపాలు వెలిగించాల్సిన ప్రదేశాలు

ఇంటి ప్రధాన ద్వారం ద్వారానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు. సంపద, శ్రేయస్సులకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కూడా ఈ ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తి ప్రవేశ ద్వారంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి దసరా రోజున ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా చతుర్మఖ దీపాన్ని అంటే నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇల్లు ఆనందం, శ్రేయస్సుతో నిండిపోతుంది.

లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించడానికి దసరా పండుగ రోజు రాత్రి మీరు డబ్బు, ఆభరణాలు లేదా విలువైన వస్తువులు ఉంచే చోట దీపం వెలిగించండి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ దీపాన్ని వెలిగించడానికి మీరు అవిసె గింజల నూనెను ఉపయోగించాలి. ఈ ప్రదేశంలో అవిసె నూనె దీపాన్ని వెలిగించడం వల్ల సంపద పెరిగి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

మనం ప్రతిరోజూ దేవుడిని పూజించేటప్పుడు దీపం వెలిగిస్తాం. అయితే దసరా పండుగ రోజున ఈ దీపం ప్రాముఖ్యత చాలా భిన్నంగా ఉంటుంది. దసరా పండుగ రోజున రాత్రిపూట ఇంట్లోని దేవుడి గదిలో అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం అంటే ఒకసారి వెలిగించిన దీపం తెల్లవారుజాము వరకు వెలుగుతూ ఉండాలి. మీరు దీనిని ఇంట్లోని దేవుడి గదిలోనే కాకుండా గుడిలో కూడా వెలిగించవచ్చు. ఇది మీ జీవితంలో ఆనందాన్ని, శాంతిని నెలకొల్పి, సకల దేవతల ఆశీస్సులను తెస్తుంది.

తులసి ఒక పవిత్రమై మొక్క. హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతీకగా , విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన మొక్కగా భావించి పూజిస్తారు. హిందూ మతంలో తులసిని ఉపయోగించకుండా చేసే కొన్ని పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నమ్ముతారు. దసరా పండుగ రోజున సంధ్యా సమయంలో తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks