నేచురల్ స్టార్ నాని-దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ప్యారడైజ్‌తో వచ్చారు. ఈ సినిమాలో కాకులకు ఎంత ప్రాధాన్యం ఉందో మెుదటి నుంచి జనాలకు అర్థమవుతూనే ఉంది. క్లియర్ కట్‌గా టీజర్‌లోనూ ఇది కడుపు మండిన కాకుల కథ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఆయా షేర్ పాటలో ధూం.. ధూం..త:త: అంటూ బీజీఎం ఇచ్చారు. మీరు టీజర్‌లో చూస్తే మెుదటల్లోనే ఒక చెట్టు కింద ఓ రూపంతో ఉన్న విగ్రహం కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు.. ధూమావతి దేవి అంటూ నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు ధూమావతి గురించి చర్చనడుస్తుంది. దీనిపై సినిమా టీమ్ ముందుగా ఎలాంటి విషయం చెప్పకపోయినప్పటికీ.. జనాలు ధూమావతి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు?

ధూమ అంటే పొగ, వతి అంటే కలిగినది. ధూమవతి అంటే పొగ రూపంలో ఉండేది లేదా పొగ చేత ఆవరించబడినది అని అర్థం. ఈమె సృష్టి నాశనం తర్వాత మిగిలే శూన్యానికి, నిరాశకు, వైరాగ్యానికి సంకేతం. సాధారణంగా దేవీ దేవతల రూపాలు అందంగా, ఆభరణాలతో అలంకరించి ఉంటాయి. కానీ ధూమవతి దేవి స్వరూపం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఈమె ముసలి రూపంలో, నల్లని లేదా తెల్లని వస్త్రాలు ధరించి, జడలు విప్పుకొని జుట్టుతో వితంతువుగా దర్శనమిస్తుంది. ఈమె రథంపై కాకి ఉంటుంది లేదా కాకినే వాహనంగా కలిగి ఉంటుంది. ఒక చేతిలో బియ్యం చెరిగే చాటను పట్టుకుంటుంది. ఈమె ఆకలి, దాహాలతో అలమటించే రూపాన్ని కలిగి ఉంటుంది.
ఆధ్యాత్మికత పరంగా చూసుకుంటే.. సృష్టి ఉద్భవించక ముందు, సృష్టి అంతమయ్యాక మిగిలే శూన్య స్థితికి ధూమావతి ప్రతీక. ప్రాపంచిక సుఖాలు, మోహాలు, అందం శాశ్వతం కావని... కష్టం, దుఃఖం, ముసలితనం, మరణం కూడా జీవితంలో భాగమేనని ఈమె రూపం గుర్తుచేస్తుంది. బాహ్య రూపాన్ని చూసి మోసపోకుండా, ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ఈమె ఉపాసన తోడ్పడుతుంది.
ధూమావతి గురించి ఒక విచిత్రమైన పురాణ గాథ ఆమె పుట్టుకను వివరిస్తుంది. ఒకసారి సతిదేవి శివుడిని తనకు తినడానికి ఏదైనా తీసుకురమ్మని అడిగింది. ఆయన ఆమెకు ఏం తీసుకురాలేదు. తీవ్రమైన ఆకలితో ఆమె శివుడినే మింగేసింది. అప్పుడు శివుడు ఆమెతో మాట్లాడి, తనను పైకి పంపమని ఒప్పించాడు. ఆమె అంగీకరించింది, శివుడిని బయటకు వదిలిన వెంటనే శపించడంతో ఆమె శరీరం నుండి పొగలు వస్తాయి. పొగలతో ఒకరకమైన ఆకారం ఏర్పడుతుంది. ఆమెనే ధూమావతి అనే కథ కూడా ఉంది.
{{/usCountry}}ధూమావతి గురించి ఒక విచిత్రమైన పురాణ గాథ ఆమె పుట్టుకను వివరిస్తుంది. ఒకసారి సతిదేవి శివుడిని తనకు తినడానికి ఏదైనా తీసుకురమ్మని అడిగింది. ఆయన ఆమెకు ఏం తీసుకురాలేదు. తీవ్రమైన ఆకలితో ఆమె శివుడినే మింగేసింది. అప్పుడు శివుడు ఆమెతో మాట్లాడి, తనను పైకి పంపమని ఒప్పించాడు. ఆమె అంగీకరించింది, శివుడిని బయటకు వదిలిన వెంటనే శపించడంతో ఆమె శరీరం నుండి పొగలు వస్తాయి. పొగలతో ఒకరకమైన ఆకారం ఏర్పడుతుంది. ఆమెనే ధూమావతి అనే కథ కూడా ఉంది.
{{/usCountry}}ధూమవతి దేవిని ఎక్కువగా గృహస్థులు కాకుండా తంత్ర సాధకులు, సన్యాసులు ఉపాసిస్తారు. ఈమెను పూజించడం వల్ల శత్రు బాధలు, తీవ్రమైన రోగాలు, దారిద్య్రం, దుఃఖాలు, దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. సాధకులకు లోతైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని ప్రసాదించే దేవతగా ఈమెను ఆరాధిస్తారు. 'ధూం ధూమావతి ఠః ఠః॥ ధూం ధూం ధూమవతి త్హః త్హః' మూల మంత్రం అని చెబుతారు.
గమనిక : ఈ కథనంలోని కంటెంట్ కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. పుస్తకాలు, ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించండి.